తెలుగులో చిన్న సినిమాకి సైన్ చేసిన పూజా హెగ్దే.!

అసలు పూజా హెగ్దేకి ఏమయ్యింది.? తెలుగులో పెద్ద ప్రాజెక్టుల్ని ఆమె వదిలేసుకుందా.? ఆమెను సోకాల్డ్ నిర్మాణ సంస్థలు, దర్శకులు వదిలించుకోవడం జరిగిందా.? కారణం ఏదైతేనేం, బుట్ట బొమ్మ తెలుగులో సినిమా చేసి చాన్నాళ్ళే అయ్యింది. కొత్త సినిమాలేమీ కమిట్ అయినట్లు లేదు కూడా.!

వరుసగా ఫ్లాపులు రావడంతో గోల్డెన్ లెగ్ బుట్ట బొమ్మ కాస్తా, ఐరన్ లెగ్ బుట్ట బొమ్మ అయిపోయింది. అసలు విషయానికొస్తే, పూజా హెగ్గే తాజాగా తెలుగులో ఓ చిన్న సినిమాకి ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోన్న చిన్న సినిమా అట అది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి భిన్నంగా డిఫరెంట్ జోనర్‌లో ఆ సినిమా వుండబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాలో హీరో పాత్ర జస్ట్ అలా వుంటుందంతే. హీరోయిన్ చుట్టూనే కథంతా తిరుగుతుందట. డీ-గ్లామర్ లుక్ కాదుగానీ, పూజా హెగ్దేకి ఇది నిజంగానే చాలా కొత్త పాత్ర అని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఓ ప్రముఖ నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడట కూడా.

తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తారట.