ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. వరుస ఆఫర్లతో టాలీవుడ్ ని షేక్ చేసింది. తరువాత వరుస వైఫల్యాలు రావడం, పెద్ద సక్సెస్ ని ఇస్తుందనుకున్న రాధే శ్యామ్ సైతం తీవ్ర నిరాశను మిగల్చడంతో పూజా హెగ్డే కెరియర్ ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈమె దుల్కల్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే మలయాళం తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి విజయాలని సొంతం చేసుకుని రేసుగుర్రం లా దూసుకుపోతున్నాడు. ఈ మధ్య రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను అంగీకరించిన మరొక తెలుగు చిత్రమే ఆకాశం లో ఒక తార. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
ఈ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ సింపుల్ గా ఒక రైతు లాగా కనిపించాడు. ఈ సినిమాని టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, స్వప్న సినిమాలతో కలిసి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యానర్స్ ఈ మూవీ నిర్మాణంలో భాగమవుతూ ఉండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. పాన్ ఇండియన్ లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి పవన్ సాదినేని దర్శకుడు.
అతను దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో పూజ హెగ్డే పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హీరోయిన్ గా చేసి ఆ సినిమా హిట్ అయితే ఆమె కెరియర్ మళ్లీ ఉపందుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.