వైసీపీకి పవన్ కళ్యాణ్ చేస్తున్న డ్యామేజీ ఎంత.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ‘వారాహి విజయ యాత్ర’ ఎందుకు ప్రారంభించినట్లు.? ఈ జిల్లాల్లో జనసేనకు బలం చాలా చాలా ఎక్కువ గనుక. ఎంత ఎక్కువైనా, ప్రధాన రాజకీయ పార్టీల్ని తలదన్నేంత సీన్ అయితే జనసేనకు లేదు.

2019 ఎన్నికల్లో కేవలం రాజోలు నియోజకవర్గం నుంచి మాత్రమే జనసేన గెలిచింది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే, వైసీపీలోకి దూకేశారు అది వేరే సంగతి. అయినాగానీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ బలం పెరుగుతూ వస్తోంది.

ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం, జనసేన పార్టీ ఓటు బ్యాంకు కొన్ని నియోజకవర్గాల్లో 35 నుంచి 40 శాతం వరకూ పెరిగింది. ట్రయాంగిల్ ఫైట్ జరిగితే, జనసేన కొన్ని చోట్ల గెలుస్తుంది.. కొన్ని చోట్ల గెలవాల్సిన పార్టీల్ని దెబ్బ తీస్తుంది కూడా.

అందుకే, చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేశారు. జనసేన పార్టీని తన దారిలోకి తెచ్చుకున్నారు. అయితే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ప్రారంభించాక, పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో చాలా చాలా మార్పు కనిపిస్తోంది. ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని..’ అనే సంకేతాలు పంపుతున్నారు.

దాంతో, కింది స్థాయిలో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. వైసీపీ ఇమేజ్ దారుణంగా పడిపోయింది.. స్థానిక ప్రజా ప్రతినిథుల కారణంగా. పుండు మీద కారం జల్లినట్లుగా పవన్ కళ్యాణ్ పర్యటనతో వైసీపీ మరింత డీలా పడుతోంది. కాపు సామాజిక వర్గ వైసీపీ నేతలపై, కాపు యువత నుంచి ఒత్తిడి చాలా తీవ్రమవుతోంది.

చూస్తోంటే, వైసీపీని ఉభయ గోదావరి జిల్లాల్లో నిండా ముంచేసేలా వారాహి యాత్ర సాగుతోందని అనుకోవచ్చేమో.!