ఎన్టీయార్ నటిస్తున్న తాజా మూవీ ‘దేవర’ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివతో కలిసి ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి డిస్కషన్స్ ఊపందుకున్నాయని తెలుస్తోంది. రేపో మాపో నందమూరి వారసుడి డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ రానుంది.
కాగా, ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించబోతున్నారనీ తెలుస్తోంది. దానికి ఎన్టీయార్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారట అనే కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ఆల్రెడీ లుక్ టెస్టులు గట్రా కానిచ్చేస్తున్నారట.
డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరు దాదాపు ఫిక్సయినట్లే అని తెలుస్తోంది. అలాగే, బోయపాటి పేరుతో పాటూ, పలువురు యంగ్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయ్.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, జనవరిలోనే లాంఛింగ్ వుండనుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడితో ప్రస్తుతం బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పనులు పూర్తి కాగానే, తనయుడి డెబ్యూ మూవీ అప్డేట్కి సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారట బాలయ్య.