Tollywood: అభిమానులను టెన్షన్ పెడుతున్న బాలయ్య చరణ్ సెంటిమెంట్… రిపీట్ కాకూడదంటూ?

Tollywood: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు అభిమానులకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పలానా హీరో పలానా రోజు విడుదలయితేనే హిట్ అవుతుందని ఫలానా నెలలో విడుదలైన సక్సెస్ అవుతాయి అంటూ కొన్ని సెంటిమెంట్లను పెట్టుకొని ఉంటారు. అయితే అలాంటి సెంటిమెంట్లు సినిమాలు విషయంలో భారీగా వర్క్ అవుట్ అవుతూ ఇప్పటికే ఎన్నో సినిమాలు సక్సెస్ గా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఒక సెంటిమెంట్ రామ్ చరణ్ బాలకృష్ణ అభిమానులను కలవరపెడుతోందని చెప్పాలి.

ఇంతకీ వీరి అభిమానులు టెన్షన్ పడే ఆ సెంటిమెంట్ ఏంటి అనే విషయానికి వస్తే… సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ డాకు మహారాజ సినిమా విడుదలవుతుంది అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడ విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా విడుదలవుతుంది.

ఈ క్రమంలోనే అభిమానులను వెంకటేష్ సినిమా ఎంతో కలవరపాటుకు గురిచేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినా గతంలో కూడా ఇలాగే ఈ ముగ్గురు సినిమాలు సంక్రాంతి పండుగకు వచ్చి వెంకటేష్ చిత్రం భారీ హిట్ అందుకుందని తెలుస్తోంది. 2019 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకటేష్ ఎఫ్2, సినిమాలు విడుదల అయ్యాయి.

ఇక అప్పటికి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పెద్దగా ఫేమ్ కాకపోవడంతో f2 సినిమా పై ఎలాంటి అంచనాలు లేకపోయాయి. ఇక ఎన్టీఆర్ కథా చిత్రం కావడం రాంచరణ్ బోయపాటి కాంబినేషన్లో సినిమా కావడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఊహించని విధంగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కాగా వెంకటేష్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.అయితే తిరిగి ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు సంక్రాంతి బరిలో దిగబోతున్న నేపథ్యంలో అభిమాలు కలవర పడుతున్నారు.