సూపర్ స్టార్ మహేష్ బాబు నెగిటివిటీకి ఎప్పుడూ దూరంగా వుంటారు. ఆయన పనేదో ఆయన కామ్‌గా చేసుకుంటూ పోతుంటారు. చేయాలనుకుంటే కమర్షియల్ ప్రకటనలు చేస్తారు. లేదంటే సినిమాలతోనే సరిపెట్టుకుంటారు. అంతేకానీ, రాజకీయాల ఆలోచన ఎప్పుడూ మహేష్ మెదడులో తట్టినట్లు దాఖలాల్లేవు.
అయితే, ఈ మధ్య విచిత్రంగా మహేష్ బాబు పేరును రాజకీయాల్లో ప్రస్థావిస్తున్నారు. అనవసరంగా ఆయన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు కొందరు.
వైసీపీకి సపోర్టర్‌గా మహేష్ బాబు వుండబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై ఓ స్పష్టత రానుందట. అయితే, ఇంతవరకూ ఏ రాజకీయా పార్టీతోనూ సన్నిహితంగా కానీ, విబేధించి కానీ వున్నట్లు ఆధారాల్లేవ్ మహేష్ విషయంలో.
ఇదే విషయాన్ని ఇంకాస్త స్పష్టంగా చెప్పబోతున్నాడట మహేష్ బాబు. అయితే, ఈ స్పష్టత మహేష్ ద్వారా వస్తుందా.? లేక నమ్రత ద్వారా వస్తుందా.? అనేది తేలాల్సి వుంది. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పరిస్థితే అటూ ఇటూ కాకుండా వుంటే, మరోపక్క ఈ రాజకీయాల గందరగోళం ఏంటీ మహేషా.? అంటూ ఆయన అభిమానుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోందట. వీలైనంత త్వరగా ఈ యవ్వారంపై స్పష్టత వస్తే మంచిదని అభిమానులు భావిస్తున్నారట.