రాజకీయాల్లో స్పష్టత ఇవ్వనున్న మహేష్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు నెగిటివిటీకి ఎప్పుడూ దూరంగా వుంటారు. ఆయన పనేదో ఆయన కామ్‌గా చేసుకుంటూ పోతుంటారు. చేయాలనుకుంటే కమర్షియల్ ప్రకటనలు చేస్తారు. లేదంటే సినిమాలతోనే సరిపెట్టుకుంటారు. అంతేకానీ, రాజకీయాల ఆలోచన ఎప్పుడూ మహేష్ మెదడులో తట్టినట్లు దాఖలాల్లేవు.

అయితే, ఈ మధ్య విచిత్రంగా మహేష్ బాబు పేరును రాజకీయాల్లో ప్రస్థావిస్తున్నారు. అనవసరంగా ఆయన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు కొందరు.

వైసీపీకి సపోర్టర్‌గా మహేష్ బాబు వుండబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై ఓ స్పష్టత రానుందట. అయితే, ఇంతవరకూ ఏ రాజకీయా పార్టీతోనూ సన్నిహితంగా కానీ, విబేధించి కానీ వున్నట్లు ఆధారాల్లేవ్ మహేష్ విషయంలో.

ఇదే విషయాన్ని ఇంకాస్త స్పష్టంగా చెప్పబోతున్నాడట మహేష్ బాబు. అయితే, ఈ స్పష్టత మహేష్ ద్వారా వస్తుందా.? లేక నమ్రత ద్వారా వస్తుందా.? అనేది తేలాల్సి వుంది. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పరిస్థితే అటూ ఇటూ కాకుండా వుంటే, మరోపక్క ఈ రాజకీయాల గందరగోళం ఏంటీ మహేషా.? అంటూ ఆయన అభిమానుల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతోందట. వీలైనంత త్వరగా ఈ యవ్వారంపై స్పష్టత వస్తే మంచిదని అభిమానులు భావిస్తున్నారట.