గులాబీ బాస్‌కి ‘ఆ ఉద్దేశ్యం’ వుందా? లేదా?

kcr master plan on mayor seat

గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి గ్రేటర్‌ మేయర్‌గిరీ విషయమై వున్నఆసక్తి ఎంత.? గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించిందిగానీ, మేయర్‌గిరీ దక్కించుకోవడానికి అవసరమైనన్ని సీట్లు మాత్రం ఆ పార్టీకి గ్రేటర్‌ ఓటర్లు కట్టబెట్టలేదు. మజ్లిస్‌ సహకారంతో మాత్రమే గులాబీ పార్టీ గ్రేటర్‌ మేయర్‌గిరీ దక్కించుకోవాల్సి వుంది. అయితే, తమ వద్దకు ఎవరూ మద్దతు కోసం రాలేదని మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించడంతో, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ‘బెట్టు’ నాటకానికి తెరలేపింది. ఫిబ్రవరి వరకూ సమయం వున్నందున, ఇప్పుడే మేయర్‌ పీఠం విషయమై తొందరేమీ లేదంటూ టీఆర్‌ఎస్‌ అధినేత తనయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తేల్చేశారు. దాంతో, ఇప్పుడు ఈక్వేషన్స్‌ గందరగోళంగా మారాయి. ఎవరో ఒకరు మేయర్‌ పీఠం దక్కించుకోవాలి. కానీ, ప్రస్తుతానికి ఆ పదవి త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది.

kcr master plan on mayor seat
kcr master plan on mayor seat

కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా.?

మేయర్‌ గిరీ ఎవరికి దక్కాలన్న విషయమై పెద్దగా సస్పెన్స్‌ లేదు. ఆ ఛాన్స్‌ టీఆర్‌ఎస్‌కే వుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్‌ గిరీ దక్కించుకోవాలంటే అది చాలా కష్టతరమైన వ్యవహారం. మజ్లిస్‌ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలి. కానీ, అది అంత తేలికైన వ్యవహారం కాదు. అందుకే, టీఆర్‌ఎస్‌ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మజ్లిస్‌ తనంతట తానుగా వచ్చి మంతనాలు జరపాలని కేసీఆర్‌ ఆశిస్తున్నారట. అయితే, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. మరోపక్క, బీజేపీ గనుక మేయర్‌ గిరీపై కన్నేస్తే.. అప్పుడు మజ్లిస్‌ అధినేతకు వేరే దారి వుండదు.. కేసీఆర్‌ దగ్గరకు పరిగెత్తాల్సిందే. ఇలా, ఈ రాజకీయ వ్యూహాలతో మూడు ప్రధాన పార్టీలూ మేయర్‌ గిరీ విషయమై ‘శీతకన్ను’ వేసినట్లే కనిపిస్తోంది.

తప్పు చేసింది గ్రేటర్‌ ఓటరే.!

‘హంగ్‌’ ఫలితం రావడం వెనుక గ్రేటర్‌ ఓటరుదే తప్పిదమన్న భావన కలిగించేలా రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ వ్యవహార శైలి కనిపిస్తోంది. లేకపోతే, ‘మేయర్‌ పదవి మాదే’ అని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రకటించేసేది. గందరగోళం సృష్టించి, చివరికి ఎలాగైనా టీఆర్‌ఎస్‌ ఆ పదవి దక్కించుకుంటుంది. లేదంటే, వ్యూహాత్మకంగా ఆ పదవిని మజ్లిస్‌కి కొన్నాళ్ళు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేసీఆర్‌ వ్యూహాలు ఎప్పుడెలా మారతాయో ఊహించడం కష్టం.

కార్పొరేటర్లను కాపాడుకోవడం కష్టమే మరి.!

అసెంబ్లీ ఎన్నికల కోసం, లోక్‌సభ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లుగానే గ్రేటర్‌ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఖర్చు చేశారు. కొందరైతే, ‘అంతకు మించి’ ఖర్చు చేశారట. అలాంటివారిని కాపాడుకోవడం ఏ పార్టీకి అయినా కష్టమే. ఎక్కడ బేరం కుదిరితే అక్కడికి వెళ్ళిపోవడానికి పలువురు కొత్త కార్పొరేటర్లు సిద్ధంగా వున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బేరసారాలు కూడా గట్టిగానే జరుగుతున్నాయట. తప్పదు మరి, ఓటుకి 2 వేలు, ఆ పైన ఖర్చు చేసినోళ్ళకి.. దాన్ని రాబట్టుకునే అవకాశం వస్తే ఆగుతారా.?