తెలంగాణ మంత్రి హరీష్ రావు మళ్లీ నోరు జారారు. కారణం తెలియదు కానీ… గతకొన్ని రోజులుగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతూ, అసందర్భ ప్రేళాపనలను చేస్తున్నారనే విమర్శ మూటగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్ మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని అంశాలను కెలుక్కుని… ఫలితంగా టి.ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ నేతలు మైకుల ముందు, ఏపీ జనాలు ఆన్ లైన్ వేదికగానూ విమర్శలు గుప్పించే పనికి పూనుకుంటున్నారు.
అర్ధజ్ఞానమో, అజ్ఞానమో తెలియదు కానీ… సిద్దిపేట జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన హరీష్ రావు.. మరోసారి ఏపీ మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి.. నేను ఏపీ ప్రజల్ని తిట్టింది లేదు.. ఏం చేసింది లేదు.. అయినా కొంత మంది నాయకులు నాపై ఎగిరి ఎగిరి పడుతున్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మా కాళేశ్వరంలా నీళ్లు తెచ్చి మాట్లాడండి.. విశాఖ ఉక్కు కోసం పోరాడండి.. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందో తెలుసుకోండి.. ఏపీ రాష్ట్రంలోకంటే తెలంగాణలో పథకాలు బాగున్నాయి. ఆ విషయాన్నే మాట్లాడా. ” అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో… మైకులకు పనిచెప్పిన ఏపీ మంత్రులు సంగతి అటుంచితే… ఆన్ లైన్ వేదికగా హరీష్ పై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ వాసులు. ఆ ప్రశ్నలు, విమర్శలు చాలా అర్ధవంతంగా ఉండటంతో… కేసీఆర్ ను ఇరుకునపెట్టడానికి, ఏపీ వాసులతోనూ – నేతలతోనూ తిట్టించడానికే హరీష్ ఇలాంటి సంబంధం లేని పనులు ఎత్తుకుంటున్నారా అని సందేహపడుతున్నారు బీఆరెస్స్ శ్రేణులు – కేసీఆర్ అభిమానులు – కేటీఆర్ వర్గం నేతలు!
ఎంత టీఆరెస్స్ ను బీఆరెస్స్ గా మార్చితేమాత్రం… హరీష్ రావులో పాత తత్వం మారలేదని దీనిద్వారా అర్ధం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆయనకు ఆంధ్ర వాసులు అంటే ద్వేషం కొంచెం కూడా తగ్గలేదని చెబుతూ… ఉద్యమ సమయంలో ఏపీ జనాలపై హరీష్ వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. కడుపులో అంత కుట్ర పెట్టుకున్న హరీష్… రాష్ట్రం విడిపోయాయక కూడా మారకపోవడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్పుకొస్తున్నారు!
మరికొంతమంది నెటిజన్లు… హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో నరకంగా మారిన రోడ్లను… దౌర్భాగకరంగా కనిపిస్తున్న డ్రైనేజీ వ్యవస్థనూ ఫోటోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఇది తెలంగాణలో కేసీఆర్ పాలనలో హరీష్ కి కనిపిస్తున్న అభివృద్ధి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
ఒక పక్క తెలంగాణలో నిజాం షుగర్స్ ను తెరిపించడంలో వైఫల్యం చెందిన తెలంగాణ ప్రభుత్వం… విశాఖ ఉక్కు గురించి భారీగా ప్రసంగాలు చేయడం గొప్ప హాస్యాస్పద విషయమని చెబుతున్నారు. నిజంగానే తెలంగాణలో అంత డబ్బు ఉంటే, ఖజానాలో నోట్లకట్టలు మూలుగుతుంటే… బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోమని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో… ఆర్ధిక మంత్రిగా ఉన్న హరీష్ రావు తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఏ తేదీల్లో ఇస్తున్నారో చెప్పాలని… తనకింద నలుపు చూసుకోవాలని సూచిస్తున్నారు!
స్టెచ్చర్స్ లేక పేషెంట్లను కాళ్లుపట్టి ఈడ్చుకెళ్తున్న పరిస్థితి తెలంగాణలోని ఆసుపత్రులది. ఆ విషయం హరీష్ కళ్లకు కనిపించకపోవడం ఆశ్చర్యమే! లేక, బంగారు తెలంగాణలో, కేసీఆర్ పాలనలో అది కామనే అనుకుంటున్నారేమో!
ఈ విధంగా… ఏపీ జనాలు, నెటిజన్లు హరీష్ మాటలకు స్పందిస్తూ.. కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. అయితే… ఏపీ వాసులు సందిస్తున్న ప్రశ్నలు, చేస్తున్న విమర్శల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే!