TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పెద్ద ఎత్తున వాదోపవాదనాల నడుమ నడుస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ కొంతమంది తాగే అసెంబ్లీకి వస్తున్నారని వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేయాలి అని మాట్లాడటంతో అది కాస్త వివాదంగా మారింది.
ఇకపోతే తాజాగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై కూడా నోరు పారేసుకున్నారు యూస్ లెస్ ఫెలో అంటూ నిండు సభలో అందరి ముందు మాట్లాడటంతో పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దొంగ అంటూ మాట్లాడారు అయితే ఈ విషయంపై వెంటనే రియాక్ట్ అయిన హరీష్ రావు యూస్ లెస్ ఫెలో అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెల్లరేగిపోయారు.
ఇక వీరికి హరీష్ రావు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు మాటిమాటికి దొంగ అని మాట్లాడటంతో నేను యూస్ లెస్ ఫెలో అనడంలో తప్పు లేదని ఈయన ఎదురు తిరిగారు అయితే హరీష్ రావు నిండు సభలో ఇలా అధికార నేతలను పట్టుకొని మాట్లాడటం సబబు కాదని ఆయన ఇంకా అధికారంలో తామే ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు ఇలా నిండు సభలో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుగా పరిగణిస్తూ ఆయన అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ ఇచ్చేశారు.
ఇక మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా ఐదుసార్లు దొంగ దొంగ అని అన్నారు ఆయన కూడా క్షమాపణలు చెబుతారా అంటూ హరీష్ రావు ఎదురు ప్రశ్న వేశారు.నన్న దొంగ అన్న వారిని యూజ్ లెస్ ఫెలో అనడం తప్పా? అని ప్రశ్నించారు. ఎవ్వరు అలా అన్నా క్షమాపణ చెప్పాల్సిందే అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఎవడా యూస్ లెస్ ఫెలో ?
అసెంబ్లీలో హరీశ్ రావు నోటి దురుసు..
ఇంత సీనియారిటీ ఉండి అసెంబ్లీలో తోటి సభ్యుడిని అంత మాటంటవా…? అంటూ కాంగ్రెస్ సభ్యుల ఫైర్..
అయినా లైవ్ లో అందరూ చూస్తుంటే సంస్కారం లేని భాష ఉపయోగించడం ఏంటి..?
ఇంకా పదవిలో ఉన్నాం.. అధికారం మాదే అనుకుంటున్నవా ఏంది..?… pic.twitter.com/vLIDMvD3YY
— Telugu Vibe (@TeluguVibe) December 19, 2024