జనసేనకు 25 + 3 సీట్లు… బాబు ఫైనల్ చేసిన లిస్ట్ ఇదే?

ఏపీలో మరో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఈ సమయంలో అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో… టీడీపీ, జనసేన మాత్రం పొత్తులో పోటీచేయబోతున్నాయి. అయితే ఇదేమీ కొత్త పొత్తు కాదని.. కాకపోతే అధికారికంగా ప్రకటించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చేనెల 1 న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాయి.

ఈ సమయంలో ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా… ప్రజల కోసం కలుస్తున్నాం, రాజకీయాలకోసం కాదన్న రేంజ్ లో చినబాబు – కల్యాణ్ బాబు స్పందించారు. అయితే… జనసేనకు టీడీపీ 30 లోపు సీట్లే ఇవ్వబోతుందని.. ప్రస్తుతానికి 25 ఫైనల్ చేసిందని తెలుస్తుంది. ఈ మేరకు ఒక లిస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

అయితే… ఇది టీడీపీ తయారు చేసి వదిలిన లిస్ట్ ఆ… లేక, తమ కోరికను బయట పెడుతూ జనసేన వైరల్ చేస్తున్న జాబితానా అనేది తెలియదు కానీ… లిస్ట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ జాబితాలో విజయనగరం, శ్రీకాకుళంలో జనసేనకు ప్రస్తుతానికి ఒక్క సీటు కూడా ఉండకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జిల్లాల వారిగా ఉన్న సీట్ల వివారాలు ఇప్పుడు చూద్దాం!

తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ సిటీ, పిఠాపురం, ముమ్మిడివరం, కొత్త పేట, రాజమండ్రి రూరల్, అమలాపురం, పి గన్నవరం, రాజోలు గా ఉన్నాయని చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా: నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు.

విశాఖ జిల్లా: గాజువాక, యలమంచిలి.

గుంటూరు జిల్లా: తెనాలి, పత్తిపాడు.

ప్రకాశం జిల్లా : దర్శి, గిద్దలూరు.

చిత్తూరు జిల్లా: తిరుపతి, చిత్తూరు.

కడప జిల్లా: పులివెందుల, మైదుకూరు.

కర్నూల్ జిల్లా: కర్నూలు.

అనంతపురం జిల్లా: అనంతపురం

వీటితో పాటు మూడు దాకా ఎంపీ సీట్లు జనసేనకు ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. అవి ఒకటి మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ లేక విశాఖపట్నం అని అంటున్నారు. ఇలా 175 సీట్లలో పాతిక సీట్లు జనసేనకు ఇవ్వడం ద్వారా గెలిచిన తర్వత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని టీడీపీ పక్కా ప్లాన్ తో ఉందని అంటున్నారు. అయితే జనసేన పాతిక సీట్లకు ఓకే అంటుందా.. లేక, ఇంకో నాలుగైదు సీట్లు అడుగుతందా అనేది వేచి చూడాలి.

అయితే ఇలా వినిపిస్తున్న మాటలు మాత్రం జనసైనికులకు ఏమాత్రం జీర్ణం కావడం లేదని… ఎలాంటి జనసేనను ఎలాంటి స్థితికి తీసుకొచ్చారంటూ ఫైరవుతున్నారని అంటున్నారు.