Ram Charan Fans: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఒకవైపు ఇంటర్వ్యూలు మరొకవైపు ఈవెంట్లతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు ఈ మూవీ నుంచి విడుదలైన ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇకపోతే తాజాగా మూవీ మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగింది. కాగా ఈ ఈవెంట్ కి కాకినాడ జిల్లా గైగోలు పాడుకు చెందిన ఆరవ మణికంఠ అలాగే తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు హాజరయ్యారు. ఈవెంట్ ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. అభిమానుల మృతి వార్తతో ఆవేదన వ్యక్తం చేశారు రామ్ చరణ్ అలాగే ఆర్థిక సాయం కూడా చేశారు.
పవన్ కళ్యాణ్ కూడా అభిమానుల మృతి పై స్పందిస్తూ ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ అభిమానులు కూడా గొప్ప మనసును చాటుకున్నారు. మృతి చెందిన మెగా అభిమానుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. వారికి అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెర్రీ ఫ్యాన్స్ చేసిన పనిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మెగా అభిమానులు నెటిజన్స్.