Puhspa 2: పుష్ప కామెంట్స్ ఫై స్పందించిన రాజేంద్ర ప్రసాద్.. హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయంటూ!

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాపై టాలీవుడ్ నటుడు హీరో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హరికథ వెబ్ సిరీస్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి అని అన్నారు రాజేంద్ర ప్రసాద్.

అయితే తాజాగా తాను చేసిన కామెంట్స్ పై రాజేందర్ ప్రసాద్ స్పందించారు. అయినా తాజాగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పుష్ప -2 చిత్రంలో హీరో పాత్రపై ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఇటీవల అల్లు అర్జున్‌ ను కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నాము. సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి ఇద్దరం నవ్వుకున్నాము. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్‌ గా చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తామని ఆయన అన్నారు. హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి.

సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి.. అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప 2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఆయన సినిమాల విషయానికి వస్తే.. పవన్ ప్రభాస్ దర్శకత్వం వహించిన పూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి అర్చన నటించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించారు. రుపేశ్ చౌదరిని నిర్మించిన ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్‌ కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ పుష్ప-2 సినిమాపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.