UI Movie: కన్నడ స్టార్ హీరో నటుడు ఉపేంద్ర గురించి మనందరికీ తెలిసిందే. ఉపేంద్ర కు కన్నడ తో పాటు తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. కొన్ని కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఉపేంద్ర. ఇకపోతే తాజాగా ఉపేంద్ర యుఐ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు ఉపేంద్రనే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.
యూఐ విడుదలైన మొదటి వారంలోనే మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కర్ణాటక లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ యూఐ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని అంటున్నారు. అలాగే తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకి ఓటీటీలో విడుదల కాబోతోంది విడుదల అయింది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.
తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ అయిన సన్ నెక్స్ట్ ఓటీటీలో జనవరి రెండో వారంలో యుఐ సినిమా విడుదలవుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉపేంద్ర సుదీప్ నటించిన ముకుంద-మురారి చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. కాబట్టి సన్ నెక్స్ట్‌లోనే యుఐ మూవీ కూడా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. యూఐ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కేపీ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను పంచుకున్నారు. UI చిత్రం ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఫేక్ న్యూస్. సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం లేదా విడుదల చేయడంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు, ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మొద్దు. అధికారిక ప్రకటనను చిత్ర బృందం స్వయంగా ప్రకటిస్తుంది అని తెలిపారు.