Sreemukhi: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. తెలుగులో ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీముఖి. అలాగే కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది. పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు చేస్తూ సినిమాలలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఈవెంట్లో శ్రీముఖి నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ల గురించి చెప్తూ రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అప్పట్లోనే మనం విన్నాము. సాక్షాత్తు ఇప్పుడు దిల్ రాజు, శిరీష్ లాగా మన కళ్ళముందే కూర్చున్నారు అని చెప్పింది. అయితే రామ లక్ష్మణులుగా అన్నదమ్ములను పోలిస్తే తప్పు లేదు కానీ రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్ అని అనడంతో పలు హిందూ సంఘాలు, నెటిజన్లు శ్రీముఖి పై తీవ్ర విమర్శలు చేసారు. శ్రీముఖి పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో శ్రీముఖి దీనిపై స్పందిస్తూ క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ సందర్బంగా శ్రీముఖి ఈ వీడియోలో మాట్లాడుతూ..
రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నాను. నేను ఒక హిందువునే. నేను దైవ భక్తురాలినే. రాముడిని అమితంగా నమ్ముతాను. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వీలైనంత జాగ్రత్తపడతాను అని మీ అందరికి మాటిస్తు మీ అందరికి క్షమాపణ కోరుతున్నాను. పెద్దమనుసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్ అని చెప్పింది. దీంతో శ్రీముఖి వీడియో వైరల్ గా మారింది.