Ram Charan: బాలయ్య మా ఇంటికి వచ్చి అలాంటి పని చేశారు.. ఎప్పటికీ మర్చిపోలేను: రామ్ చరణ్

Ram Charan: టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా చాలానే విడుదల అయ్యాయి. ఒకే వేదికపై మెగా హీరో అలాగే నందమూరి హీరో కనిపించడంతో ఇద్దరు హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ ఫుల్ ఎపిసోడ్ తాజాగా విడుదల అయింది.

ఈ ఎపిసోడ్ ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ షోలో రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే గతంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొచ్చారు చరణ్. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. 1992లో అందరి తర్వాత చివరగా మేము చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. అయితే ఒక రోజు బాలయ్య గారు మా ఇంటికి సాయంత్రం పూట తన ఇద్దరు పిల్లలతో వచ్చి చిరంజీవి మీ అబ్బాయిని బయటకు పంపు ఇప్పుడే వచ్చాడు కదా హైదరాబాద్ కి, మా పిల్లలతో కలిసి డిన్నర్ కి బయటకు తీసుకెళ్తాను అని అన్నారు.

నాగార్జున సర్కిల్ లో ఒక రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్లారు. అది బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పటికి అది గుర్తు ఉంది నాకు అని తెలిపారు. దీంతో బాలయ్య మంచి మనసుని అభినందిస్తున్నారు. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అంటూ పొగిడేసారు చరణ్. ఈ వార్త వైరల్ అవ్వడంతో బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి గొప్ప మనసు ఉన్న వ్యక్తి అంటూ మెగా అభిమానులు బాలయ్య బాబు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేజర్ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.