చిరంజీవి ‘భోళాశంకర్’ మేనియా అనూహ్యం.!

ఒక్క సినిమా చిరంజీవి స్థాయిని అమాంతం కిందికి పడేసింది. మళ్ళీ ఒక్క సినిమా చిరంజీవి స్థాయిని ఎవరూ ఊహించని విధంగా పైపైకి తీసుకెళ్ళింది. కిందకు పడేసిన సినిమా ‘ఆచార్య’ అయితే, పైకి లేపిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’.! ఒక్క సినిమాతో పడిపోయే రేంజ్ కాదు మెగాస్టార్ చిరంజీవిది.. అన్నది పాత మాట. ఆయనే ఆ విషయం చెప్పారు.

సినిమా బాగోకపోతే, ఆ సినిమాలో నేనున్నా జనం పట్టించుకోరని చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చెప్పడం విన్నాం. ఇప్పుడేమో ‘భోళా శంకర్’ సినిమాకి అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి మించి ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. నిజానికి, ‘భోళా శంకర్’ మీద పెద్దగా బజ్ లేదు మొదట్లో. సినిమాని ఆపెయ్యడమే బెటరని అనుకున్నారట కూడా ఓ దశలో. అలాంటిది ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.

సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చిందనేది ఇన్‌సైడ్ సోర్సెస్ రిపోర్ట్.