ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా టూర్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పైనా, ఆయన ఆత్మహత్యపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. కోడెల ఆత్మహత్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతోపాటు… కోడెల కుమారుడికి సత్తెనపల్లి సీటు కూడా తీవ్ర చర్చకు రావడం కొసమెరుపు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన ఆయన.. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోటప్పకొండ అంటే కోడెల శివప్రసాదరావు గుర్తు వస్తారని తెలిపిన చంద్రబాబు… ఆ స్థాయిలో ఆయన ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకుని, అభివృద్ధి చేశారని కొనియాడారు.
అనంతరం… ఆయన ఆత్మహత్యపై బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రతికినంతకాలం పల్నాటి పులిగా ఉన్న కోడెల.. జీవితంలో ఎవరికీ భయపడలేదని.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం.. ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం చేసిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సంగతులు అలా ఉంటే… బాబు ప్రసంగిస్తున్న సమయంలో… “సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడెల కుమారుడు.. శివరాం” అంటూ నినాదాలు వినిపించాయి. శివరాం కూడా… తన తండ్రి ఆశయాలు నిలబెడుతానని, పార్టీకి ప్రజలకు తన తండ్రిలా సేవ చేసుకుంటానని… సత్తెనపల్లిలో టిక్కెట్ తనకే ఇవ్వాలని బాబును బ్రతిమాలుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ విషయంలో బాబు… కోడెల ఫ్యామిలీని లైట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది!
కాగా… 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం… కోడెల శివప్రసాద్ కుమారుడు, కుమార్తె.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేశారంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే! “కే ట్యాక్స్” పేరుతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వ్యాపారులు దుకాణాదారులు కాంట్రాక్టర్ల నుంచి భారీగా నగదు వసూలు చేశారని పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే!