గతకొన్ని రోజులుగా చంద్రబాబు సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని… అలాకానిపక్షంలో ఇక టీడీపీ అడ్రస్ తో పాటు నారావారి అడ్రస్ కూడా రాజకీయంగా గళ్లంతు అవుతుందని నమ్ముతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఎంతకైనా తెగించడం.. మరెంతకైన దిగజారడం వంటి పనులు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అవును… గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు గమనిస్తున్న వారు ఎవరికైనా ఇలాంటి ఆలోచనలే వస్తాయని అంటున్నారు. లోకేష్ – పవన్ కల్యాణ్ లు ఏవో నోటికొచ్చిన అవాకులూ, చెవాకులూ మాట్లాడారంటే అనుకోవచ్చు! కారణం… వారిని, వారి మాటలను, వారి హామీలను, వారి చేష్టలను, వారి రాజకీయాలను ప్రజలు అంత సీరియస్ గా తీసుకోరని అంటున్నారు!!
అయితే 40ఏళ్ల రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు సైతం చివరి దశలో ఇలాంటి ఫ్రస్ట్రేషన్ కి వెళ్లిపోవడం ఏమిటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వల్ల చివరి దశలో ఎలాంటి మానసిక ఒత్తిడి వచ్చిందో.. నేడు జగన్ వల్ల చంద్రబాబుకు అంతకుమించిన ఒత్తిడి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఈ కాలంలో ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవించకతప్పదనే మాటలు గుర్తుచేసుకుంటున్నారు.
పుంగనూరులో మైకందుకున్న చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… “వైసీపీ నేతలు వస్తే కర్రలతో బడితె పూజ చేయండి” అని సూచించారు. ఇది చంద్రబాబు రాజకీయ అనుభవం! అనంతరం “నన్ను బెదిరించడం మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు.. కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా..” ఇవి పుంగనూరులో బాబు పలికిన ఆణిముత్యాలు.. ప్రజాస్వామ్య హితమైన మాటలు!
ఇక తాజాగా శ్రీకాళహస్తిలో స్పందించిన బాబు… “కర్రకు కర్ర, దెబ్బకు దెబ్బ.. మీరు ఒక దెబ్బ కొడితే మేం రెండు కొడతాం.. రెచ్చిపోతే ముక్కలు ముక్కలు చేసి పిండి చేస్తాం..” ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. దీంతో… బాబుకు జగన్ వల్ల కలుగుతున్న ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదని.. ఆయన పరిస్థితి పగవాడికి కూడా రావొద్దని.. పైనుంచి అన్నగారు చూస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం.
చంద్రబాబు ఇలా నోరు జరుతూ… ఇంగితం, విజ్ఞత మరిచి మాట్లాడటం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు సమస్య వస్తోందని అంటున్నారు అధికారులు. చంద్రబాబు పర్యటన లేకపోతే కచ్చితంగా అంగళ్లులో గొడవ జరిగేది కాదేమో, పుంగనూరులో తలలు పగిలేవి కావేమో అనే సందేహాలు సామాన్యులు లేవనెత్తుతున్నారు.
పర్యటన పేరుతో స్థానిక నాయకులను తిట్టిపోస్తూ.. తీవ్ర దూషణలు చేస్తున్న చంద్రబాబు పరోక్షంగా టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఆవేశంలో వారు రెచ్చిపోతే, అటువైపు వైసీపీ వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా గొడవలు జరుగుతున్నాయి. చంద్రబాబు వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం ఇదే.
చెప్పుతీసుకుని కొడతా.. బట్టలు ఊడతీసి కొడతా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. ఒకటీకి రెండు ఇస్తాం.. నేను మూర్ఖుడిని బ్రదర్ అంటూ చినబాబు లోకేష్ చెబుతున్నారు. పైగా పేర్లు రాసుకుంటూ ఎరుపు బుక్కేసుకుని తిరుగుతున్నారు. తాజాగా చంద్రబాబు… ముక్కలు ముక్కలు చేస్తాం.. అని చెబుతున్నారు.
వీరి రాబోయే కాలంలో అధికారంలోకి రావడానికి ప్రజలను అడుగుతున్నవి ఇవే. వీరి రివేంజ్ లు తీర్చుకోవడానికి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి. ప్రజలకు పరిపాలన అందించేవారికి ఓట్లు వేయాలని ఉంటుంది. ఇందులో భాగంగా తన పాలన వల్ల మేలు జరిగితేనే తనకు ఓట్లు వేయండని జగన్ అంటుంటే… తాము అధికారంలోకి వస్తే ముక్కలు ముక్కలు చేస్తాం, చెప్పు తీసుకుని కొడతాం అంటూ మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారు విపక్ష నేతలు!
మరి ఈ విషయాలపై ఏపీ ప్రజలు ఎలా ఆలోచిస్తారు.. ఎవరిని ఎన్నుకుంటారు.. అనేది వేచి చూడాలి!