నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారంలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు టచ్ చేస్తుందనీ ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయిలో ‘భగవంత్ కేసరి’కి ఆఫర్లు కూడా వచ్చాయట.
అయితే, అనిల్ రావిపూడి సినిమా కావడంతో, బాలయ్య ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. బిజినెస్‌ని 70 కోట్లకే తగ్గించారనీ తెలుస్తోంది. అవును ఒకప్పుడు బిజినెస్ ఏ రేంజ్లో అయినా నడిచిపోయేది. లక్కు బాగుండి జరిగిన బిజినెస్‌కి అనుకూలంగా రిలీజ్ తర్వాత రిజల్ట్ వసూళ్లు వస్తే బాగానే వుండేది.
ఏ మాత్రం కాస్త అటూ ఇటూ అయ్యి తేడాలొచ్చినా నిర్మాత దెబ్బయిపోయేవాడు. అయినా అన్నీ మూసుకుని వుండాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. బాధ్యత హీరో పైనా పడుతుంది.
సినిమా హిట్ అయితే ఓకే. ఒకవేళ ఫట్ అయితే మాత్రం నష్టాలు పూడ్చాల్సిన బాధ్యత తీసుకోవల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ముందు జాగ్రత్త పడ్డారట. 70 కోట్లకే థియేట్రికల్ బిజినెస్‌ని క్లోజ్ చేశారనీ తెలుస్తోంది.