సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కష్టపడుతూ పని చేస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ ఉంటారు.అయితే ఇలా వచ్చిన డబ్బులు వచ్చిన విధంగానే ఖర్చవుతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు. ఇలా వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే ఖర్చు అవుతూ ఉండటం వల్ల చాలామంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం కొన్ని వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుందని భావిస్తారు. అయితే ఇలా చేతిలో డబ్బు నిలవకుండా ఉన్న సమయంలో ఈ వాస్తు పరిహారాలను పాటిస్తూ ఇంట్లో మార్పులు చేస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుంది.
మన ఇంట్లో ఏదైనా పగిలిపోయిన అర్థం లేదా విరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విగ్రహాలు కనుక ఉంటే వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన చేతిలో రూపాయి కూడా నిలబడదు.ఇలా పగిలిపోయిన అద్దాలు విరిగిపోయిన చిత్రపటాలు కనుక ఉంటే వెంటనే వాటిని తీసుకువెళ్లి పారుతున్న నీటిలో నిమజ్జనం చేయాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైనే ఉంటుంది.ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి కొళాయి నుంచి నీరు ఏకధాటిగా లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి సంపద కూడా అలాగే వెళ్ళిపోతుంది. అందుకే నీటి కొళాయిలు కనుక లీక్ అవుతూ ఉంటే వెంటనే మరమ్మత్తు చేయించాలి.
ఇక మీ ఇంట్లో పడకగదిలో ఇనుప కడ్డీ లేదా ఇనుప వస్తువులు కనుక వేలాడదీసినట్లయితే అంతా శుభమే కలుగుతుంది. బెడ్ రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకుఎడమ వైపు ఇనుప కడ్డీ లేదా ఏదైనా ఒక వస్తువు కనుక వేలాడదీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు అయితే అందంగా నగలతో అలంకరించినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడుతీయడం కూడా ఎంతో శుభ సూచకం.