పురాతన కాలం నుండి మన దేశంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దానధర్మాలు చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా మన జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. సాధారణంగా పండగ వేళల్లో చాలామంది దానధర్మాలు చేస్తుంటారు. కానీ సరైన సమయానికి సరైన రోజుకి దానం చేయటం వల్ల అద్భుత ఫలితాలు పొందవచ్చునని ధర్మశాస్త్రాలలో వివరించబడింది. అందువల్ల ఏ వస్తువులలో దానం చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పేదవారికి అక్కడ డబ్బు దానం చేస్తూ ఉంటారు. అలాకాకుండా ఒకవేళ పేదవారికి దానం చేయాలని మీరు భావిస్తే ఇత్తడి వస్తువులను దానం చేయాలి. పౌర్ణమి నాడు అందులో కొన్ని లవంగాలు ఉంచి పేదవారికి ఇత్తడి వస్తువులు దానం చేయటం వల్ల ఇంట్లో ఆహారానికీ, సంపదకూ లోటు ఉండదని ధర్మ శాస్త్రాలలో వివరించబడింది. అంతేకాకుండా ఇలా దానం చేయటం వల్ల జీవితంలో మనకు ఎదురయ్యే విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి మనం చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది.
అలాగే పౌర్ణమి రోజున ఆలయాల ముందు భిక్షాటన చేసే వారికి వెండి లేదా బంగారు నాణ్యాలు దానం చేయటం వల్ల కూడా ఎన్నో అద్భుత ఫలితాలు ఉంటాయి. కడు పేదవారికి ఇలా బంగారు వెండి దానం చేయటం వల్ల ఆ దానాన్ని స్వీకరించే వారి మనసు సంతోషంతో నిండిపోయి వారు నిండు మనసుతో మనల్ని ఆశీర్వదించడం వల్ల ఏడాది పాటు ఇంట్లో సిరిసంపదలతో పాటు ఇంట్లో మనుషుల మధ్య ఎటువంటి కలహాలు లేకుండా ఏడాది మొత్తం సుఖసంతోషాలతో జీవిస్తారు.