మనలో చాలామంది దాన గుణాన్ని కలిగి ఉంటారు. అన్ని గుణాలలో ఉత్తమమైన గుణం దాన గుణం అని పెద్దలు చెబుతారు. దాన గుణం మోక్షానికి ద్వారం అనే సంగతి తెలిసిందే. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సంపాదించిన ధనంలో కొంత మొత్తాన్ని అర్హులకు దానం చేసేవాళ్లకు మాత్రమే పుణ్యఫలం దక్కుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆపదల నుంచి కాపాడటం కోసం దానధర్మాలు చేయడం ఉత్తమమని చెప్పవచ్చు.
పేదవాళ్లు సైతం తమ శక్తి కొద్దీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఇతరుల ఆస్తులను దానం చేయడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. అందరికీ రక్తదానం, అవయవ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. సంపాదించిన ధనాన్ని దానం చేస్తే మాత్రమే ఆ డబ్బుకు సార్థకత చేకూరుతుంది.
అన్ని దానాలలో అన్నదానం ఎక్కువగా సంతృప్తిని ఇస్తుందని చెప్పవచ్చు. ఏ దానం చేయలేని వారు కనీసం మంచి నీళ్లను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అదే సమయంలో అపాత్ర దానం మంచిది కాదు. అర్హత లేని వాళ్లకు దానం చేయడం వల్ల చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. శక్తి, స్థాయి ఆధారంగా దానాలు చేయడం ఉత్తమమని చెప్పవచ్చు.
ఇతరుల నుంచి ఏదో ఒకటి ఆశించి దానం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. దానం తెలిసిన వాళ్ల కంటే తెలియని వాళ్లకు చేస్తే మరింత మంచి ఫలితాలు చేకూరుతాయి. స్థాయికి తగ్గ దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని చాలామంది భావిస్తారు.