పవన్ కళ్యాణ్‌కి సినీ విరాళాలు పెద్దమొత్తంలో.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, జనసేన పార్టీ ‘విరాళంగా ఒక రోజు వేతనం’ కాన్సెప్టుని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. జనసైనికులు, జనసేన పార్టీ మద్దతుదారులు.. పెద్దయెత్తున విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

మరోపక్క, సినీ పరిశ్రమ నుంచీ అనూహ్యంగా విరాళాలు వెళ్ళబోతున్నాయట. ఇప్పటికే ప్రవాహం మొదలైందని అంటున్నారు. ఓ నిర్మాత, తన ప్రొడక్షన్ హౌస్ తరఫున ఏకమొత్తంగా భారీ విరాళాన్ని అందించనున్నట్లు ఇప్పటికే జనసేన పార్టీకి సమాచారం ఇచ్చారట.

పలువురు దర్శకులు కూడా తమవంతుగా, తమ ఒక్కరోజు సంపాదనను జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారట. అయితే, ఇలా ఇచ్చేవారిలో చాలామంది తమ పేర్లను గోప్యంగా వుంచమని కోరుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అంటే, సినీ పరిశ్రమలో చాలామందికి అభిమానం. నేరుగా పవన్ కళ్యాణ్‌కి రాజకీయ మద్దతు ప్రకటించకపోయినా, ఇలాంటి విషయాల్లో జనసేనకు అండగానే వుంటారు వాళ్ళంతా.

పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలూ, తమకు తోచిన మొత్తం జనసేనకు విచాఫళంగా ఇవ్వనున్నాయట. ఈ కాన్సెప్ట్ ఏదో బావుంది కదూ.! ఓ కమెడియన్ కూడా కొంత మొత్తాన్ని జనసేన కోసం విరాళంగా ప్రకటించబోతున్నాడట.. అదీ, సెప్టెంబర్ 2న.