సాధారణంగా ప్రస్తుత కాలంలో జీవించటానికి ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే సంపదకు ప్రతిరూపంగా భావించే లక్ష్మీదేవిని కూడా నియమనిష్టలతో పూజించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం వద్ద కొన్ని రకాల వస్తువులను ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఏ ఏ వస్తువులు ఇంటి ముఖ ద్వారం వద్ద ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
• తోరణం: మన భారతీయ సంస్కృతిలో తోరణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఏంటి ముఖద్వారానికి తోరణాలు కట్టడం సహజం. అయితే ప్రతిరోజు ఇంటి ముందు పూలు ఆకులతో తోరణం తయారుచేసి ఇంటి ముఖ ద్వారానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది.
• స్వస్తిక్: వాస్తు శాస్త్రంలో స్వస్తిక్ గుర్తు కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి తలుపు బలి స్వస్తిక్ గుర్తు రాయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంతోషం, సమృద్ధి ఉంటాయి.
• పూల మొక్కలు: ఇంటి ముఖ ద్వారం ముందు పూల మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ పూల మొక్కలు ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
• లక్మీ పాదము లేదా మూర్తి: సొంత ఇల్లు కలిగి ఉన్నవారు ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీ మూర్తిని లేదా లక్ష్మీ పాదాలను ఉంచవచ్చు. ఇక అదే ఇంట్లో ఉండేవారు లక్ష్మీదేవి ఫోటోని తలుపు మీద ఉంచవచ్చు.