సాధారణంగా మనం పగలు లేక రాత్రి పడుకున్న సమయంలో సర్వసాధారణంగా కలలు అనేవి వస్తుంటాయి. ఇలా మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నప్పుడు లేదా బాగా అలసిపోయి నిద్రపోతున్నప్పుడు కూడా ఇలాంటి కలలు రావడం సర్వసాధారణం.అయితే కొన్నిసార్లు మనకు వచ్చిన కలల వల్ల ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాము అలాగే మరికొన్నిసార్లు ఎంతో సంతోషకరమైన కలలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా కలలో చాలామందికి పక్షులు జంతువులతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చాలామందికి తమ కుటుంబంలో ఎవరైనా బాగా ప్రేమించే వ్యక్తులు కనుక చనిపోతే తరచూ వారు కలలోకి రావడం జరుగుతుంది.అయితే ఇలా చనిపోయిన వ్యక్తి కలలోకి రావడం దేనికి సంకేతం అలా రావడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..చనిపోయిన పూర్వీకులు మన కలలో కనపడితే వెంటనే మహాభారతం రామాయణం వంటి వాటిని చదవడం ఎంతో మంచిది.
ఇక మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు కలలో కనిపించి ఆకలితో బాధపడుతున్నట్లు కనుక అనిపిస్తే వెంటనే మనం పేదలకు అన్నదానం చేయాలి. అలా కాకుండా కలలో చనిపోయిన వ్యక్తులు మౌనంగా ఉన్నారు అంటే మనం ఏదో తప్పు చేయబోతున్నామని సంకేతం.అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు కోపంతో కనుక కనపడుతున్నారు అంటే వాళ్లు మన నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. అందుకే కలలో పూర్వీకులు కనక కనపడితే వారు చెప్పిన విధంగా చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.