ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదట గర్భగుడిలో కాకుండా దీపం ఇక్కడ పెట్టాలని తెలుసా?

Shri-Padmanabhaswamy-Temple-1019x573

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దేవుని పూజించటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత దేవాలయానికి వెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే దేవాలయానికి వెళ్ళిన తర్వాత అందరూ గర్భగుడిలోకి వెళ్లి దేవుడి ముందు దీపం పెట్టి పూజిస్తారు. అయితే ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదటగా గర్భగుడిలో దీపం పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా పండ్లు, పూలు వంటివి దేవుడికి సమర్పించడానికి తీసుకువెళ్లాలి . అయితే గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత నేరుగా గర్భగుడిలోకి వెళ్ళకూడదు. మొదటగా ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి అక్కడ నమస్కరించి దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న ఇతర దేవతలకు కూడా నమస్కరించి పూజ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లాలి. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత ఐదు తొమ్మిది ఇలా వారికి తోచినన్ని ప్రదక్షిణలు చేయవచ్చు.

ఇక ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి అక్కడ దేవుడు ముందు దీపం వెలిగించి మనం తీసుకువెళ్లిన పండ్లు పూలు నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఆ తర్వాత భక్తితో మన కోరికలు నెరవేరాలని దేవుని భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.