గురు గ్రహ దోషంతో బాధ పడుతున్నారా… ఈ మొక్క ఇంటి ఆవరణంలో ఉండాల్సిందే!

సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటారు. కొందరు ఇంటి అలంకరణ కోసం మొక్కలను పెంచుతూ ఉంటారు. మరికొందరు దైవ సమానమైన మొక్కలను పెంచుతూ పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి ఆవరణంలో తులసి బిల్వపత్రి వంటి చెట్లు ఉండడం సర్వసాధారణం. మరి కొందరు అరటి చెట్టును పెంచుతూ ఉంటారు. అయితే ఏ ఇంటి ఆవరణంలో అరటి చెట్టు ఉంటుందో ఆ అరటి చెట్టు వల్ల ఆ ఇంటికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అరటి మొక్క వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పాలి. మరి అరటి మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

అరటి మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావిస్తారు.
ఇలా అరటి మొక్క ఏ ఇంటి ఆవరణంలో ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారిపై మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో తూలు తూగుతుందని చెప్పాలి. అరటి మొక్క ఇంట్లో ఉండటం వల్ల గురుగ్రహం ద్వారా వచ్చే శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇక పెళ్లి కానీ అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరిగే సూచనలు కూడా ఉన్నాయని పండితులు తెలియచేస్తున్నారు. అరటి మొక్క ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఆ ఇంట్లో పిల్లల ఆరోగ్యం విద్యా బుద్ధులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. అరటి మొక్క ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే ఇంటి ఆవరణంలో అరటి మొక్క ఉండడం ఎంతో శుభ పరిణామం..