ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి భక్తులు కుటుంబ సమేతంగా పూజలు చేస్తున్నారు. అయితే పండితులు వెల్లడిస్తున్న విషయాల ప్రకారం కృష్ణాష్టమి రోజున కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు. కృష్ణాష్టమి పండుగ రోజున కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కృష్ణాష్టమి పండగ రోజున ఇంట్లో వీలైనంత ప్రశాంత వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో కృష్ణాష్టమి రోజున గొడవలు పడటం, అమర్యాదగా ప్రవర్తించడం చేయకూడదు. ఈ పండుగ రోజున గోవులపై దయతో వ్యవహరించడంతో పాటు జంతువులకు ఆహార, పానీయాలను అందించడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పండుగ రోజున తులసి ఆకులను తెంపడం ఏ మాత్రం మంచిది కాదు. మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి మొక్క కాగా ఈరోజు తులసి ఆకులను తెంపడం వల్ల నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు చెట్లను నరకడం వల్ల కూడా నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి. కృష్ణాష్టమి రోజు మాంసం, మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
కృష్ణాష్టమి రోజున కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కృష్ణాష్టమి రోజున భాగస్వామితో ప్రేమానురాగాలకు దూరంగా ఉంటే మంచిది. పండగ రోజున జంతువులకు హాని కలిగించే పనులు చేయకూడదు. ఈ పండగ రోజున ఎవరిపై కోప్పడటం లేదా అగౌరపరచడం చేయకూడదు. ఈరోజు కృష్ణుడి విగ్రహానికి పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరిస్తే మంచిది.
వరి పిండి నీళ్లతో కన్నయ్య పాదాల ముద్రలు వేసి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ: మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. నెమలి ఈక, వేణువు, వెన్న వంటివి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. గోమాత విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేయవచ్చు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం ద్వారా దేవుని అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు.