కార్తీకమాసంలో కచ్చితంగా పాటించాల్సిన నియమాలివే.. ఈ తప్పులు చేస్తే నష్టం!

హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైన మాసం అనే సంగతి తెలిసిందే. శివుడు, విష్ణుమూర్తిలకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైన మాసం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. శివుడిని పూజించడం వల్ల మోక్షం లభించడంతో పాటు సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పవచ్చు. హిందూ మతంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది.

కార్తీకమాసంలో శివుడిని ఆవుపాలతో అభిషేకం చేసి జాజిపూలతో పూజించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. కార్తీకమాసంలో తిరుమలకు వెళ్లే భక్తులు కపిలేశ్వరుడిని దర్శించుకుంటారనే సంగతి తెలిసిందే. కార్తీకమాసం సమయంలో కపిలేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. కార్తీక మాసం భక్తులకు సైతం అధ్యాత్మిక భావనను కలిగిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుందని చెప్పవచ్చు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున తలారా స్నానం చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్తీక వ్రతం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు. కార్తీకమాసంలో అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ చేస్తే మంచిది.

కార్తీక పూర్ణిమ అత్యంత పవిత్రమైన రోజు కాగా ఈరోజు శివాలయం దగ్గర జ్వాలాతోరణ దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. యువతులు వివాహం జరిగిన తొలి సంవత్సరంలో కార్తీక పౌర్ణమి పూజను చేస్తారు. కార్తిక మాసంలో నియమ నిష్టలతో పూజ చేయడం వల్ల కోటి పుణ్య ఫలాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.