దుర్గాసప్త శ్లోక పారాయణం చేయడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. శుక్రవారం నాడు కనకదుర్గాదేవిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ నుండి ఆ పేరు వచ్చింది.
ఇంద్రకీలాద్రి దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడవుగా వారికోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మతల్లి. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుపుతున్నాయి. అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయవిశేషాలను తెలుసుకుందాం. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.కృష్ణానదీ తీరం దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడుగగా అమ్మా! నువ్వు ఎప్పుడూ నా హృదయ స్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే! కీలా! నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడవై వుండు.
నేను కృతయుగంలో అసురసంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడుకిచ్చిన వరం ప్రకారం మహిశావర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది. కనకవర్ణ శోభితురాలు తదనంతరం ప్రతీరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. శుక్రవారం పూట దుర్గాదేవి పూజ చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ఎప్పుడూ మన వెంటే వుంటాయి అంటారు కొందరు పండితులు.