సల్మాన్ ఖాన్ , కత్రినా “భారత్ ” కథ తెలుసా ?

సల్మాన్  ఖాన్, కత్రినా కైఫ్  జంట అంటేనే  ఆ సినిమాకు తెలియని క్రేజ్ వస్తుంది . ప్రస్తుతం వీరిద్దరూ  హీరో హీరోయిన్ గా నటిస్తున్న “భారత్ ” అనే చిత్రం పై అందరి దృష్టి వుంది . ఈ చిత్రానికి దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ . దుబాయ్ లో  కొంత భాగం షూటింగ్  పూర్తి చేసుకుంది . నవంబర్ మాసం ప్రారంభంలో ఈ చిత్రం షూటింగ్ పంజాబ్ లో జరపడానికి నిర్ణయించుకున్నారు . దాదాపు ఒక నెల రోజుల పాటు షూటింగ్ పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లోజరపడానికి  ఎంపిక చేశారు . కొన్నివందల మంది ఈ చిత్రం షూటింగ్ కోసం సెట్స్  నిర్మిస్తున్నారు . ఇవి మామూలు సెట్స్ కావు . అందుకే అనుభవం వున్న ఆర్ట్  డైరెక్టర్ల పర్య వేక్షణలో వీటి రూప కల్పన జరుగుతుంది .

భారత్ సినిమా లో కొన్ని సన్నివేశాలు  దేశ విభజన  సమయంలో జరిగిన ఘట్టాలను గుర్తుకు తెస్తాయని అంటున్నారు . అందుకే ఇండియా , పాకిస్తాన్ కు సంబందించిన  సన్నివేశాలు కాబట్టి పంజాబ్ ను ఎంపిక చేసుకున్నారు . పంజాబ్ బోర్డులో కొన్నాళ్లుగా ఈ సెట్స్ వేస్తున్నారు . 71 సంవత్సారాలు నాటి దేశ విభజన వాతావరణాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఈ సెట్స్ తయారవుతున్నాయి .

భారత్ చిత్రం 2014లో వచ్చిన కొరియా సినిమా ” ఒడే టు  మై  ఫాదర్ ” హక్కులు తీసుకొని దానికి భారత్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు .ఈ చిత్రంలో జాకీ  షరాఫ్  రైతు కుమారుడు పాత్రలో నటిస్తున్నాడు. దిశా పాటని, టబూ ,వరుణ ధావన్ మొదలైనవాళ్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద ఎన్నో ఎక్సపెట్టేసన్స్ వున్నాయి. వచ్చే సంవత్సరం విడుదలవుతుంది .

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles