సైఫ్ అలీఖాన్-దీపికా పదుకొణే జంటగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ 10 ఏళ్ల క్రితం ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బాలీవుడ్ బాక్సాపీస్ ను షేక్ చేసింది. సైఫ్–దీపికా పెర్పామెన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. దీంతో ఆ సినిమాకు కొనసాగింపు గా మరో సినిమా చేయాలని ఇంతియాజ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చివరిగా గతేడాది లవ్ ఆజ్ కల్ -2 టైటిల్ తో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
ఇందులో కార్తీక్ ఆర్యన్-సైఫ్ డాటర్ సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం కామెడీ..రొమాంటిక్ యాంగిల్ లో ఉంది. హీరో పాత్రను కామిక్ గా చూపిస్తూనే రొమాంటిక్ గా మలిచాడు. ఇక సారా డామినేటింగ్ గాళ్ల్ పాత్రలో అదరగొట్టింది. హీరోతో పెదవి ముద్దు సన్నివేశాల్లో చెలరేగింది. కామెడీ..రొమాన్స్..లవ్ ని ఇలా మూడు జానర్లను ఒక్క ట్రైలర్ లోనే చెప్పేసారు. కడుపుబ్బా నవ్వుకునే కామెడీకి మాత్రం కొదవ లేదనిపిస్తోంది.
ఇక ఫుల్ రన్ లో నవ్వులు పువ్వులే అనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోఈ ట్రైలర్ జోరుగా వైరల్ అవుతోంది. సైఫ్ పోషించిన పాత్రలో కార్తీ పెర్పామెన్స్….హీరోయిన్ పాత్రలో సైఫ్ డాటర్ కనిపించడం విశేషం. తొలి భాగం సక్సెస్ అవ్వడంతో పార్ట్ -2పై కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈచిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.