‘2.0’షాకిచ్చే వార్త: అప్పుడే 370 కోట్లు వెనక్కి వచ్చేసింది!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కోటి బయటికొస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమనేది ఖాయమైపోయింది.

ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్ష‌కులను వేరే లోకానికి తీసుకెళ్తాయని అంటున్నారు. 3డీ ఫార్మాట్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రం రిలీజ్‌కి ముందే ప‌లు రికార్డులు బ్రేక్ చేస్తుంది.

 బాలివుడ్ హంగామా  చెప్తున్న లెక్కలు మేరకు…ఇక 3డీ టెక్నాలజీ, 4 డీ సౌండ్‌తో 2.0 చిత్రం ఇండియాలోనే 2,800 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ చిత్రం రిలీజ్‌కి ముందే 370 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని స‌మాచారం. అన్ని భాష‌ల‌లో ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌కి గాను 120 కోట్ల రూపాయ‌లు ద‌క్క‌గా, డిజిట‌ల్ రైట్స్ 60 కోట్ల‌కి అమ్ముడు అయ్యాయి.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న 2.0 చిత్రం డిస్ట్రిబ్యూష‌న్స్ రైట్స్ నార్త్‌లో 80 కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ రైట్స్ 70 కోట్లు, క‌ర్ణాట‌క 25 కోట్లు కేర‌ళ 15 కోట్లకి లైకా సంస్థ అమ్మిన‌ట్టు తెలుస్తుంది. అంటే మొత్తం 370 కోట్ల వ‌సూళ్ళు సినిమా రిలీజ్‌కి ముందే చిత్ర నిర్మాణ సంస్థ‌కి ద‌క్కిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఇక మిగతా 130 కోట్లు సినిమా రిలీజ్ అయిన తొలి రెండు మూడు రోజుల‌లోనే ఈ చిత్రం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

‘2.0’ను 6,800 థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.ఇక ఈ చిత్రం లెంగ్త్ విషయానికి వస్తే కేవలం 2.28 గంటలు (148 నిమిషాలు) మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యనానికి గురి చేస్తోంది. దర్శకుడు శంకర్‌ సినీ కెరీర్‌లో అతి తక్కువ నిడివి ఉన్న సినిమా ఇదే కావటం విశేషం.

గతంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’చిత్రం 188 నిమిషాల రన్‌టైమ్‌తో శంకర్‌ కెరీర్‌లోనే ఇప్పటి వరకు అతి ఎక్కువ నిడివి ఉన్న చిత్రంగా ఉంది. 167 నిమిషాల నిడివితో ‘రోబో’ అతి చిన్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు ‘రోబో’ స్థానంలో ‘2.0’ చేరింది.

సైంటిస్ట్‌ వశీకరణ్‌, రోబో చిట్టి పాత్రలే కాకుండా మరో మూడు పాత్రల్లో రజనీ నటిస్తుండగా, రావణుడి తరహాలోనే అక్షయ్‌ కుమార్‌ ఏకంగా 10 పాత్రల్లో కనిపి స్తారని చెప్పుకుంటున్నారు. టెక్నాలజీపరంగా చూస్తూ 2డి, 3డి, ఐమాక్స్‌ 3డి, ఐమాక్స్‌ రియల్‌ 3డి ఫార్మాట్లలో డాల్బీ అట్మాస్‌ కంటే ఉత్తమమైన సౌండ్‌ టెక్నాలజీతో ‘2.0’ను తీర్చి దిద్దుతున్నారు శంకర్‌.