లీక్ షాక్ : బాలీవుడ్ భారీ సినిమాలో షారుఖ్ ఖాన్ ఊహించని వీడియో బిట్ లీక్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మన సినిమాలు ఏ లెవెల్లో దుమ్ము లేపుతున్నాయో చూస్తున్నాము. దీనితో బాలీవుడ్ లో మన తెలుగు సినిమా దగ్గర భారీ లెవెల్లో డామినేషన్ నెలకొనడంతో తమ సినిమాలు ఎప్పుడు సత్తా చాటుతాయా అని ఎదురు చూస్తున్నారు.

కానీ ఇది మాత్రం ఇప్పుడప్పుడే నెరవేరేలా కనిపించట్లేదు. లేటెస్ట్ గా అయితే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా ఊహించని లెవెల్లో డిజాస్టరస్ వసూళ్లు అందుకుంది. ఇక దీనితో బాలీవుడ్ లో ఎప్పుడు నుంచో చాలా అంచనాలు పెట్టుకొని వస్తున్న సినిమా “బ్రహ్మాస్త్ర” పైనే అన్ని అంచనాలు పెట్టుకున్నారు.

చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకున్న ఈ సినిమాలో స్టార్ పెయిర్ రణబీర్ మరియు ఆలియా భట్ లు నటించారు. ఇవి పక్కన పెడితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ హాలీవుడ్ లెవెల్లో మైండ్ బ్లాక్ చేయగా ఇప్పుడు ఓ షాకింగ్ లీక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఈ సినిమాలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. ట్రైలర్ లో చూపించిన వానర అస్త్రకి రూపంగా షారుఖ్ ఖాన్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ గా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో అయితే ఈ విజువల్స్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. దీనితో అయితే షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాకి భారీ మైలేజ్ ఇవ్వడం ఖాయం అని చెప్పాలి. కాకపోతే ఈ లీక్ అయ్యిన బిట్ చాలా క్లారిటీ గా కనిపిస్తుండడం అనేది గమనార్హం.