ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… తులసి సామ్రాట్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా తులసి ఇప్పుడు నా మనసులో లేదు చిన్నతనంలోకి వెళ్లిపోయింది సామ్రాట్ గారు అనడంతో చూస్తున్నాను అంటూ సామ్రాట్ చెబుతారు. దేవుడు మనిషికి రెండు బాల్యాలు ఇస్తే ఎంత బాగుండేదో దేవుడు చాలా పిసినారి అంటూ తులసి మాట్లాడుతుంది. ఇలా తులసి సామ్రాట్ ఇద్దరు చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకొని మాట్లాడుతూ వెళుతుంటారు.
ఇలా వెళ్తున్న సమయంలో వారికి ఒక ఇల్లు కనిపించడంతో తులసి ఆ ఇంటిని చూసి ఎమోషనల్ అవుతుంది. ఇది తన చిన్నప్పుడు పెరిగిన ఇల్లు అని ఇల్లు ప్రస్తుతం కోర్టులో ఉందని ఇక ఆ ఇంటి గురించి సామ్రాట్ కి చెబుతూ ఇక్కడే నేను తన తమ్ముడు ఆడుకునే వాళ్ళ ఇరుగుపొరుగు వాళ్ళు ఏమన్నా పెద్దగా పట్టించుకోనే వాళ్ళము కాదు.ఈ ఇంటి కోసం తన తమ్ముడు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడని తులసి బాధపడుతుంది. దీంతో సామ్రాట్ ఆ ఇంటి తాళాలు పగలగొట్టడంతో తులసి లోపలకు వెళ్లి అక్కడ వాతావరణ పరిస్థితులను చూసి చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటుంది.
మరోవైపు డాక్టర్ అంకిత కోసం ఇద్దరు పేషెంట్స్ అక్కడికి వచ్చి కింద కూర్చుని ఉంటారు. మీరేంటి ఇక్కడ ఇలా కూర్చున్నారు వెళ్లి అక్కడ కూర్చోండి అని చెప్పి వారికి చికిత్స చేసిన తర్వాత జ్వరం మూడు రోజుల వరకు తగ్గదు మందులు వేసుకోమని చెప్పాను కదా పనులకు వెళ్లొద్దు అంటుంది.అంకిత టాబ్లెట్స్ ఇవ్వక పాత ఫీజు ఇప్పుడు ఇచ్చిన ఫీజు అంతా చెప్పండి మిగిలినది తర్వాత ఇస్తామని చెప్పడంతో తాను ఫీజు ఎక్కడ తీసుకున్నానని అంకిత ఆశ్చర్య పోతుంది. దీంతో లాస్య చేసిన పని పేషంట్స్ వివరించగా అంకిత షాక్ అవ్వడమే కాకుండా లాస్య నిజ స్వరూపం తెలుసుకుని తిరిగి ఆ పేషెంట్లకు 500 ఇచ్చి వారిని అక్కడ నుంచి వెళ్ళమని చెబుతుంది.
మరోవైపు తులసి ఆ ఇంటిని మొత్తం శుభ్రం చేస్తుంది బావిలో నీటిని తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రం చేసి తులసి కోటకు పూజ చేస్తుంది.ఇవన్నీ చూస్తున్నటువంటి సామ్రాట్ మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు కదా అని అడుగుతారు. ఇక తులసి ఆ ఇంటి వాకిలి వైపు చూస్తూ సంతోషపడగా సామ్రాట్ ఈ ఇంటి తలుపులకు ఉన్న తల పగలగొట్టాలి అని చూస్తూ ఉండగా తులసి వద్దని చెప్పిన వినకుండా సామ్రాట్ ఇంటి లోపలికి వెళ్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.