వైసీపీకి వేరే శతృవులు అవసరం లేదు. ఆ పార్టీ కొంప ముంచెయ్యడానికి.. వైసీపీ నేతలే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టున్నారు. శాఖల బాధ్యతల్ని పక్కన పెట్టేసి.. రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నమంత్రులు.. సరైన సలహాలివ్వకుండా ప్రజా ధనాన్ని గౌరవ వేతనగా లూటీ చేస్తున్న మంత్రులు.. ఇలా వైసీపీ మీద వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీకావు.
ఇలాంటి విమర్శలు వస్తున్నప్పుడు కీలక పదవుల్లో వున్నవారు ఇంకెంత బాద్యతాయుతంగా వుండాలి.? ప్చ్.. బాధ్యత అన్నదే వైసీపీ నేతల్లో కనిపించడంలేదు. ప్రజల పట్లా బాధ్యత లేదు.. పార్టీ పట్లా బాధ్యత అసలే కనిపించడంలేదు. ‘నేనింతకు మించి ఏం చేయగలను.? మీరు కూడా పని చేయాలి కదా.?’ అని పదే పదే అధినేత వైఎస్ జగన్ ‘వై నాట్ 175’ అంటూ క్లాసులు తీసుకుంటున్నాగానీ.. వైసీపీ నేతల్లో మార్పు రావడంలేదు.
తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజుకి సంబంధించి ఓ వీడియో లీక్ అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో జనసేనతో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడిందన్నది ఆ వీడియో సారాంశం. ఈ వీడియో ఎప్పటిది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
ఎవరూ కెమెరాలు ఆన్ చెయ్యలేదు కదా.? వీడియోలు తీయడంలేదు కదా.? అంటూ సీదిరి అప్పలరాజు.. మొత్తం కక్కేశారు. జనసేనతో పొత్తు గురించి వైసీపీ వెంపర్లాడటమేంటి.? ఆ పొత్తుని జనసేన కాదనేయడమేంటి.? ఎక్కడో తేడా కొడుతోంది కదా.? వైసీపీకి మంత్రి సీదిరి వెన్నుపోటు పొడుస్తున్నారా.?