తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జగన్ సంచలన వ్యూహం

తెలంగాణాలో ఎన్నికల ఫీవర్ మొదలయింది. ఈ వైరస్ ఆంధ్రను కూడా తాకింది. ఏపీ ఎలక్షన్స్ కు 6 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఎన్నికల హడావిడి జోరు పెరిగింది. పార్టీల నేతలు గ్రామాలూ చుట్టేస్తూ ప్రచారం సాగిస్తూ ప్రజలకి మరింత చేరువగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ పాదయాత్రతో, పవన్ పోరాట యాత్రతో, ఇక ఏపీ సీఎం ధర్మ పోరాట దీక్ష అంటూ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు విసురుతూ తమ పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు.

ఇదిలా ఉండగా తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు డిసెంబర్ 7 న జరగనున్నాయి. డిసెంబర్ 11 న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈ రిజల్ట్స్ ఆంధ్ర ఎన్నికలపైన కూడా ప్రాభవవం చూపుతాయని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రిజల్ట్స్ ఎఫెక్ట్ తమ పార్టీపై ప్రభావితం చూపకుండా ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వ్యూహ రచనలు చేస్తున్నారు. దీనికి సంబంధినచిన వివరాలు కింద ఉన్నాయి చదవండి.

తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ఏపీలో ప్రభావితం చేస్తాయని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారా? అలా జరిగితే దానిని ఎదుర్కోవడానికి జగన్ అమలు చేయనున్న వ్యూహం ఏంటి? తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేవరకు ఆంధ్రాలో జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారా? త్వరలో ముగింపు దశకు చేరుకోబోతున్న పాదయాత్రను జగన్ పొడిగించనున్నారా? వీటికి సమాధానం ఔననే వినిపిస్తోంది వైసిపి వర్గాల నుండి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర డిసెంబర్ ఆఖరు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాదయాత్ర చేపట్టినప్పుడు వెలువడిన షెడ్యూల్ ప్రకారం 307 రోజులు, 3,500 కిలో మీటర్లు 125 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగాల్సి ఉంది. ఇప్పటికి ఆయన 116 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 3,100 కిలోమీటర్ల పాదయాత్రను కంప్లీట్ చేశారు. ఈ లెక్క ప్రకారం పాదయాత్ర నవంబర్ 5 వరకు ముగింపు దశకు చేరుకోవాల్సి ఉంది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ పాదయాత్రను మరికొన్ని రోజులు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆంధ్రాలో కూడా ప్రభావం చూపుతాయని జగన అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి రిజల్ట్స్ వెల్లడయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తే పార్టీకి మేలు జరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కారణంగానే పాదయాత్రను డిసెంబరు చివరి వారంలో ముగించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పాదయాత్ర ముగిశాక జగన్ మరో ఎత్తుగడ రేపు ఉదయం 8 గం.లకు మన Telugurajyam.com వెబ్సైటులో…