ఆపరేషన్ గరుడ కాదు…ఆపరేషన్ గుండె దడ దడ

విజయవాడ పార్లమెంటరీ వైసీపీ సమన్వయకర్త మహమ్మద్ ఇక్బాల్‌ గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో బాబుకు పదేళ్ల జైలు శిక్ష తప్పదు అన్నారు. ఓటుకు కోట్లు కేసులో బాబే కుట్రదారుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చట్టం ముందుకు కుట్రదారుడు బాబును తీసుకురావాలి. ఆపరేషన్ గరుడ కాదు ఆపరేషన్ గుండె దడ అన్నారు మహమ్మద్ ఇక్బాల్‌. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

  • ఓటుకు కోట్లు కేసులో ప్రధాన కుట్రదారుడు బాబుకు ఏడేళ్ల నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు.
  • ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా ఆయనని కోర్టు ఎందుకు పిలవడం లేదు?
  • ఓటుకు కోట్లు కేసు విచారణ ప్రారంభం కాగానే టిడిపి నేతల్లో దడ పుట్టుకు వచ్చింది. ఈ కేసులో కుట్రదారు చంద్రబాబే.
  • రేవంత్ రెడ్డిపై విచారణ చేపడుతుంటే టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం, చట్టం ఉందేమో అన్న అనుమానం కలుగుతుంది.
  • టిడిపి నేతలు రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా మాట్లాడుతున్నారు. ఓటుకు కోట్లు కేసు టిడిపి రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట.
  • ఒక దొంగతనం కేసు, మర్డర్ కేసు, చోరీ కేసులో సొత్తు రికవరీ అయిన తర్వాత నేరస్థులు దొరికిన తర్వాత కుట్రదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. దీనికి టిడిపి నేతలు అతీతంగా మాట్లాడుతున్నారు.
  • ఓటుకు కోట్లు కేసులో నాలుగేళ్లుగా సమన్లు రాకపోవడం ఆశ్చర్యకరం.
  • రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ బ్యాగులో నుండి యాభై లక్షల రూపాయలు తీయటం స్టీఫెన్ సన్ మాట్లాడటం అనీ వీడియో, ఆడియోలతో సహా దొరికాయి.
  • బాబుగారు మాట్లాడిన “మనవాళ్ళు బ్రీఫ్డ్‌ మీ” డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఐంది కూడా.
  • ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కూడా ఇంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
  • ఈ కేసులో న్యాయ విచారణ ప్రక్రియ వేగవంతం కాగానే ఆపరేషన్ గరుడ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి ఇది ఆపరేషన్ గరుడ కాదు…టిడిపి కి గుండెదడ కొట్టుకుంటోంది.
  • ఓటుకు కోట్లు కేసు విచారణ ప్రారంభం కాగానే టిడిపి నేతల గుండెల్లో దడ పుట్టింది.
  • కుట్రదారులు అంత పట్టుబడితే వేరెవరో కుట్ర పన్నారని చెప్పడం హాస్యాస్పదం. ఓటుకు కోట్లు అనేది రాజకీయ దిగజారుడు తనానికి పరాకాష్ట. విలువలను అన్నింటికీ తిలోదకాలు ఇచ్చారు.
  • 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.
  • ఈ కేసులో న్యాయ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇక్బాల్‌.
  • ఓటుకు కోట్లు కేసులో ప్రధాన కుట్రదారుడు అయిన చంద్రబాబును పిలవాలని, ఆయనకు సమన్లు ఇవ్వాలని, కోర్టు ప్రక్రియ ముందుకు సాగాలని కోరారు ఇక్బాల్‌.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…

మూడున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఎందుకు ముందుకు నడవటం లేదో అర్ధం కావడం లేదు. మీ మధ్య ఒప్పందంలో భాగమా అని ప్రశ్నించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా… విజయవాడకు చంద్రబాబు పారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే నాలుగేళ్లు ఐంది. ఇప్పుడు అయినా ఈ కేసులోని కుట్రదారులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలన్నారు. ఏసీబీ రిపోర్ట్ ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది. వీటన్నిటి ప్రకారం చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు వైసీపీ నేత మహమ్మద్ ఇక్బాల్‌.