భార్యను ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించిన భర్త, భార్య నిజంగానే…

వారిద్దరిది ఒకే ఊరు, వారు ప్రేమించుకొని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా భార్యను చనిపో అంటూ ఆత్మహత్య చేసుకునేలా ప్రేమించాడు. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకొని చనువు చాలించింది. అసలు వివరాలు ఏంటంటే…

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని పొండూరు గ్రామానికి చెందిన చాగిశెట్టి దుర్గాబాబు, తనూజ  ప్రేమించుకున్నారు. ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఉల్లిపాయల వ్యాపార నిమిత్తం చిలకపాలెం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సజావుగా సాగుతున్న వారి కాపురంలో మనస్పర్దలు రావడంతో గొడవలు మొదలయ్యాయి.

దుర్గా బాబు తనూజను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు. సూటి పోటి మాటలతో ఆమెను బాధపెట్టేవాడు. ఈ విషయాలను తనూజ పుట్టింటి వారికి ఎప్పటికప్పుడు చెప్పేది. భర్త వేధింపులు మరీ ఎక్కువ కావడంతో మారుతాడని పుట్టింటి వారు సర్దిచెప్పారు. అయినా భర్తలో మార్పు రాలేదు.

ఈ మధ్య గొడవ పడుతూ భార్యను చనిపోవాలని వేధించాడు. నువ్వు ఆత్మహత్య చేసుకో.. తాను సంతోషంగా ఉంటానని వేధించి భార్యను ఆత్మహత్య చేసుకునే విధంగా తనూజను ప్రేరేపించాడు. ఆవేశంలో తనూజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తనూజ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనూజ మృతికి దుర్గాబాబే కారణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  

తనూజ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికి కూడా దుర్గాబాయ్ నిత్యం ఆమెను అనుమానించేవాడని తెలుస్తోంది. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో తనూజ పని చేస్తానంది. అయినా కూడా దుర్గాబాయ్ ఆమెను పనికి వెళ్లవద్దని చెప్పాడు. ఇంట్లో ఉంటే నీ ఆటలు సాగవని పని పేరుతో బయట తిరిగొద్దామనుకుంటున్నావా అంటూ హేళనగా మాట్లాడేవాడని తెలుస్తోంది. 

ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నీవంటే నాకెందుకో నచ్చడం లేదని హింసించేవాడు. శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. తనూజ  శరీరం పై గాయాలున్నాయి. తాగి వచ్చి సిగరెట్లతో కాల్చే వాడని తెలస్తోంది. తనూజను  ఎప్పుడు చనిపోవాలని అనేవాడని.. ఉరేసుకుంటావా లేక మందు తాగి చస్తావా అని ప్రశ్నించేవాడని ఇతరులు అంటున్నారు. ఇలా లేని పోని మాటలతో అనుమానించడంతో, ఆత్మహత్యకు ప్రేరేపించడంతో తనూజ నిజంగానే తనువు చాలించింది.