Y.S Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పార్టీ నేత పోలీసుల దాడిలో మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి అలాగే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఇలా పల్నాడు పర్యటనలో భాగంగా వైయస్ జగన్మహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం పల్నాడు పర్యటనపై స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.
బెట్టింగ్ ఆడుతూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఏంటి? మరి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏంటి అసలు సమాజం ఎటు పోతుంది అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి పట్టించుకోమంటే బల ప్రదర్శనలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని కోసం పోరాడిన స్టీల్ ప్లాంట్ కోసం ధర్నాలు చేసిన మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. మాకు ఆంక్షలు విధిస్తారు మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా అనుమతి తెలిపారు అంటూ ప్రశ్నించారు.
జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారన్నారు.ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని.. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ బల ప్రదర్శనలో భాగంగా నిన్న ఇద్దరు చనిపోయారు వారి మరణాలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో భాగంగా 100 మందికి అనుమతి తెలిపితే 1,000 మంది ఎలా వచ్చారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందని అన్నారు. ఇంటలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. జగన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఎందుకు అడ్డుకోలేదు అంటూ జగన్ పర్యటనపై షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.