ఎన్టీఆర్ చైతన్యరథంలా పవన్ జనరథం.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో పూర్తిస్థాయిలో బిజీ కావాలని భావిస్తున్నా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావాల్సి ఉండటంతో అందుకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది. అయితే జనరథం ద్వారా రాజకీయ యాత్ర చేసి ఏపీ ప్రజలకు దగ్గర కావాలని పవన్ అనుకుంటున్నారు. ఏపీలో పాదయాత్ర చేయాలని పవన్ భావించినా రియాలిటీలో ఉన్న కొన్ని సమస్యల వల్ల ఆ విషయంలో వెనక్కు తగ్గారు.

అయితే పవన్ కళ్యాణ్ జన రథం ఎన్టీఆర్ చైతన్యరథంలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి పవన్ ఈ జనరథంను తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. మిలటరీ గ్రీన్ కలర్ లో వార్ వెహికిల్ మోడల్ లా ఈ వాహనం ఉండనుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ జన రథం వాహనం ద్వారా విడతల వారీగా రాజకీయ కార్యక్రమాలు చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

దసరాకు కేవలం 20 రోజులు మాత్రమే ఉండటంతో పవన్ పొలిటికల్ ప్లాన్స్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రథయాత్ర మొదలయ్యే సమయానికి పవన్ పలు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారని తెలుస్తోంది. ఇకపై అన్ని పనులను షెడ్యూల్ కు అనుగుణంగా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

త్వరలో పవన్ పొలిటికల్ ప్లాన్స్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ రాజకీయాల్లో కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. జనసేన గెలుపు కోసం పవన్ అభిమానులు తమ వంతు కష్టపడుతున్నారు. అభిమానుల సపోర్ట్ తో ఎన్నికలకు వెళుతున్న పవన్ కు 2019తో పోలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని అయితే ఎన్ని సీట్లలో జనసేన గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.