ప్రేమ పెళ్లి చేసుకుంది, ప్రియుడితో కలిసి చివరకు ఇలా…

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా వారి కాపురం సాగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆమెకు ఏర్పడిన అక్రమ సంబంధం ఏకంగా భర్తనే చంపించేసింది. అది కూడా ఫేసు బుక్ మెసేంజర్ లో భర్త హత్యకు ప్లాన్ చేసి మట్టుబెట్టింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

రామ చంద్రాపురం తోటవారి వీధికి చెందిన చెల్లూరు రాంబాబు అదే ప్రాంతానికి చెందిన చెల్లూరి క్రాంతి ప్రియదర్శినిలు 17 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలో వారు అద్దెకు దిగారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తర్వాత శీలంవారి సావరానికి చెందిన కుడుపూడి మోహనశివసాయి కిషోర్ తో ప్రియదర్శినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరు నెలల క్రితం భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లి పోయింది. భర్త పోలీసులను ఆశ్రయించడంతో ఎస్పీ స్థాయి అధికారితో కౌన్సిలింగ్ ఇప్పించి వారిని ఒక్కటి చేశారు.

భర్తతో క్రాంతి ప్రియదర్శిని

భర్త దగ్గరకు వచ్చినా ప్రియుడిని మరిచిపోలేదు. దీంతో భర్తను హతమార్చేందుకు ఫేసుబుక్ మెసేంజర్ లో పథకం పన్నారు. ఫోన్ లలో అయితే దొరికిపోతామనే ఉద్దేశ్యంతో ఫేసుబుక్ మెసేంజర్ ద్వారా మెసేజ్ లు చేసుకొని హత్యకు కుట్ర పన్నారు. ఆగష్టు 26న రాత్రి భర్తకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత కిషోర్ వారింటికి వచ్చాడు.  బెడ్ పై పడుకున్న భర్తకు మెత్తతోటి ఊపిరాడకుండా చేసి ఇద్దరు కలిసి చంపారు. తాను ఒక్కదానినే చంపినట్టు చెబుతానని తనను అరెస్టు చేసిన తర్వాత బెయిల్ తీసుకోమని రూ. 2 లక్షలను ఆమె ప్రియుడికి ఇచ్చింది. ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడి హత్య చేసిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్య పోయారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.