ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దేశ భక్తుడే. అనసరంగా ఆయన సింగపూర్ లో పంటికి రూట్ కెనాల్ చేయించుకున్నారని, తెలుగోళ్ల టాక్స్ పేయర్స్ మనీని సింగపూర్ కు తగలేశాడని చాలా మంది చాలా రకాలుగా ఆడిపోసుకున్నారు. అజ్యూర్ డెంటల్ కంటే, ఆంధ్రలో మంచి పంటాసుపత్రులున్నాయని, ఆంధ్రలో మాంచి పంటి డాక్టర్లున్నారని అన్నారు. ఇక్కడ చూపించుకోకుండా సింగపూర్ లో పంటికి చికిత్స చేయించుకోవడమేమిటని, ఇందులో తిరాకసేమిటని ఆర్థిక మంత్రి యనమల రామకృష్షుడు దేశభక్తిని శంకించారు.
ఇది ఏ విధంగాను తప్పకాదు, ఎందుకంటే, సింగపూర్ లో ఆయన వైద్యం చేయించుకున్న ఆసుపత్రి తెలుగోళ్లదే. ఆపరేషన్ చేసింది తెలుగు డాక్టరే. ఆమాటకొస్తే, ఆయన తెలుగుదేశం పార్గీ ఎంపి కుటుంబీకుడే. ఆలెక్కన యనమల కష్ణుడి తరఫున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన 2.8 లక్షల రుపాయలు పరాయోళ్లకేం పోలేదు. తెలుగుదేశం కుటుంబానికి వెళ్లాయి.
ఈ కథా కమామీషు ఎంటంటే…
సింగపూర్ లోని అజ్యూర్ డెంటల్ ఆసుప్రతి మన ఆంధ్రోళ్లదే. ఆమాటకొస్తే తెలుగుదేశం పార్టీకీ బాగా అయిన వాళ్లదే.
దానిని నడుపుతన్న డాక్టరు ఎవరో కాదు, ప్రశాంత్ కనకమేడల. ఆయనెవరో కాదు, మన టిడిపి ఎంపి కనకమేడలరవీంద్ర కుమార్ కొడుకు.హైదరాబాద్ లో ఉన్న సౌజన్య డెంటల్ ఆసుపత్రి కూడా వాళ్లదే.
ఇపుడు చెప్పండి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెల్లించిన రు. 2,88,823 ఎవరో పరాయోడికి పోలేదు, మనోడే, మన ఆంధ్రోెడే, మన తెలుగుదేశం పార్టీ కుటుబానికి చెందిన వారికే పోయింది.
ఎడేవకండేడవకండి.
కనకమేడల రవీంద్ర కుమార్ గారు లాయర్ గా ఉన్నపుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి మీద వేసిన కేసులలో 18 స్టేలు రావటంలో కీలకపాత్ర పోషించారు. దీనితో ఆయనకు రాజ్యసభ నామినేషన్ లభించింది.
సింగపూర్ తెలుగుదేశం అధినేతకు ఆదర్శం. సింగపూర్ వైద్యం ఆర్థిక మంత్రికి ఆదర్శం. ఏమయినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన డబ్బు పరాయోడోకి వెళ్ల లేదు కదా? మనోడికే. దీనికి ఇంత ఎడుపెందుకు?