పుష్ప 2 ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్

పుష్ప టు సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయి ఇప్పటికే 1500 కోట్ల వసూళ్లని రాబట్టింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమా రిలీజ్ లు ఏవి లేవు కాబట్టి ఇప్పట్లో పుష్ప 2 కలెక్షన్స్ తగ్గేటట్లు కనిపించడం లేదు. అయితే చాలామంది థియేటర్ కి వెళ్లి చూడటానికి ఇష్టపడని ప్రేక్షకులు ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకుంటారు.

ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ టీం స్పందించింది. మూవీ రిలీజ్ అయిన 56 రోజులలోపు ఓటీటీలో సినిమా విడుదల చేయబోమని వెల్లడించింది. అంతవరకు మీరు థియేటర్లలోనే సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని సూచించింది.

ఈ హాలిడే సీజన్ కి పండగ అంతా థియేటర్లలోనే ఓటీటీ లో ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. పుష్ప టు మూవీ సంక్రాంతి తర్వాతే ఓటీటీ లోకి వస్తుందని విషయం చెప్పకనే చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇకపోతే కలెక్షన్స్ పరంగా రోజుకో రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా పుష్ప టు నిలిచింది. 15 రోజుల్లో 632 కోట్లు వసూలు చేసి 100 సంవత్సరాల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. మరో వారంలో 2000 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సుకుమార్ ఇంటిలిజెంట్ డైరెక్షన్ కి అల్లు అర్జున్ నట విశ్వరూపం తో పాటు ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లాయి అంతేకాకుండా ఈ సినిమాలో జగపతిబాబు, రష్మిక, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మజీ వంటి నటీనటులు నటనలో జీవించేసారని చెప్పాలి. పుష్ప టు ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఇక రాబోతున్న పుష్ప 3 ది ర్యాంపేజ్ మూవీ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.