మన దేశంలో చాలామంది డిఫెన్స్ రంగంలో ఉద్యోగం సాధిస్తే కెరీర్ పరంగా తిరుగుండదని భావిస్తారు. ఇంటర్ అర్హతతో డిఫెన్స్ రంగంలో ఉద్యోగం సాధించాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 406 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 2009 సంవత్సరం జౌలై 1వ తేదీలోపు పుట్టినవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
ఆర్మీలో 208 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎయిర్ ఫోర్స్ లో 120, నేవీలో 42 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. డిసెంబర్ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇంటర్ అర్హత ప్రస్తుత కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. ఏజ్ లిమిట్ గురించి, అర్హత ప్రమాణాల గురించి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉద్యోగాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
పదో తరగతి, ఇంటర్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు లేకపోవడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.