ఇలా చేస్తే 2019 లో జగనే ముఖ్యమంత్రి

ఇలా చేస్తే జగన్ ని సీఎంగా చూడొచ్చు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. కింద ఆ పోస్టును చూడవచ్చు.

YSRCP అభిమానులకు, కార్యకర్తలకు, YCP బూత్ కో ఆర్డినేటర్స్ కు, బూత్ కమిటి సభ్యులకు మరియు ప్రతి ఒక్క సోషల్ మీడియా వాలంటీర్ మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఇప్పటివరకు మనం మన అధినేత జగన్ మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడినా.. ఈ రాబోయే 9 నెలలు మాత్రం మనకు అత్యంత విలువైన సమయం.

ఈ కీలక సమయంలో మన జగన్ అన్న ముఖ్యమంత్రిగా చూడాలన్న మన లక్ష్యం నెరవేరడానికి మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం మన “ఓటు హక్కు” మాత్రమే.

అసలే ఇటీవల కాలంలో టీడీపీ ప్రభుత్వం పల్స్ సర్వేలు పేరుతో ప్రభుత్వ పధకాలను అందిచడానికి అంటూ ప్రభుత్వంలోని కొందరు ఉద్యోగులను “సాధికార మిత్రులు” అని నియమించి వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, నోట్ ప్యాడ్లు ఇచ్చి పల్స్ సర్వేల పేరుతో ఊళ్ళలోకి పంపుతున్నారు. వీరి అసలు ఉద్దేశం వైసీపీకి ఓటు వేసే వర్గాలను గుర్తించి వారి సమాచారం ప్రభుత్వానికి తెలియజేయడమే.

వారిచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారో గుర్తించి ఉద్దేశపూర్వకంగా వైసీపీ వారి ఓట్లను వలస పోయారు, ఊళ్ళో ఉండడం లేదని ఏదొక అబద్దపు సాకుతో ఎలాంటి వివరణ మరియు ముందస్తు సమాచారం లేకుండా, పంచాయితీలలో బహింరంగ చర్చ జరగకుండా అక్రమంగా టీడీపీ నేతల ఇళ్ళల్లో కూర్చొని కొత్త ఓటర్ లిస్టులో మార్పులుచేర్పులు చేస్తూ..భారీ ఎత్తున కేవలం వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారంట. ఇలా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారట.

కాబట్టి మనం చేయవలసిందేమిటంటే ఎన్నికలకు 6 నెలల ముందు

ఎన్నికలకు ఇంకా కేవలం 9 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల సంఘం నిభంధనలు ప్రకారం ఎన్నికలకు 6 నెలల ముందు ఆపధర్మ ప్రభుత్వం ఉంటుంది. ఆ కాలంలో కొత్త ఓట్లు చేర్చడం. కొత్త గుర్తింపు కార్డులు పొందడం కుదరదు. కాబట్టి మనకు కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి, అక్రమంగా తొలగించిన ఓట్లు తిరిగి పొందడానికి ఇక మిగిలింది కేవలం మూడు నెలలు సమయం మాత్రమే.

కావున మన వైసీపీ అభిమానులు ప్రతి ఒక్కరు మీకు కానీ..మీ బంధువులకు కానీ..మన పార్టీకి చెందిన వారికి..ముఖ్యంగా గ్రామాలలోని మనలను నమ్ముకొని ఉన్న దళితులు, మైనార్టీలు, ఇతర బలహీన వర్గాలలో ఓటు హక్కు లేని వారికి కొత్త ఓటు కోసం ఈ-సేవ లో త్వరగా అప్లై చేసుకోండి.. కావలసింది సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు మరియు ఒక పాస్ పోర్టు ఫోటో మాత్రమే. ఫీజు కూడా చాలా తక్కువ. అంటే 25 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది మనకు మన పార్టీకి స్ధానిక సంస్ధలకు జరిగే ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుంది.

కాబట్టి ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మండల MRO ఆఫీసుకి వెళ్ళి 150 రూపాయల చలానా చెల్లించి కొత్త ఓటర్ లిస్టు తెచ్చుకొని మన వార్డు, డివిజన్, గ్రామ పరిధిలోని మన వారి ఓట్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక వేళ ఏదైనా కారణంతో ఓటు తొలగించినట్లుయితే కొత్త ఓటు ఈ -సేవ లో త్వరగా అప్లై చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఈ 3 నెలు పాటు కొత్త ఓట్లు గుర్తించి వాటిని నమోదు చేయడం కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించండి.

మీరు చేర్చే ఒక కొత్త ఓటే ఈ ప్రభుత్వాన్ని కూల్చగలదు.
మీరు చేర్చే ఈ ఒక్క ఓటే మన MLA అభ్యర్ధిని గెలిపించగలదు.
మీరు కొత్తగా చేర్పించే ఈ ఒక్క ఓటే జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేస్తుంది.

మన వైసీపీ పార్టీని అధికారంలోకి తేవడానికి, మన జగన్ అన్నని ముఖ్యమంత్రిగా చూడడానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం మన ఓటు మాత్రమే.
జగన్ అన్న కోసం కసిగా పనిచేయండి.
కసిగా కొత్త ఓట్లు చేర్పించండి.
గుర్తు పెట్టుకోండి.
మనకు ఉంది ఇంక మూడునెలల సమయం మాత్రమే..
ఈ సమాచారాన్ని వీలైనంతవరకు అందరికి షేర్ చేయగలరు.