తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. తితిదే కీలక నిర్ణయం

TTD, Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసి సాధరణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. ఆ రెండు రోజుల్లో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ సర్వదర్శనం రద్దు చేసినట్లుగా తితిదే వెల్లడించింది. వీఐపీల దర్శన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రస్టు ప్రకటించింది. ఎక్కువ మంది దర్శించుకునేలా అదనంగా దర్శన టోకెన్లు జారీ చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భక్తులకు మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది. సర్వదర్శనం కోసం  30వేల టోకెన్లను తితిదే జారీ చేయడానికి సిద్దమైంది.