Actor Shivaji: నోటి #$%@&#… నారీమణుల దెబ్బ – శివాజీ అబ్బా..!

Actor Shivaji: “సామాన్లు” కనిపించేలా దుస్తులు ధరించొద్దంటూ అనాల్సిందంతా అనేసి తాపీగా సారీ చెప్పాడు నటుడు శివాజీ. టాలీవుడ్ కు చెందిన కొందరు మహిళా దర్శకనిర్మాతలు, నటీమణులు నిప్పులు చెరుగుతూ రప్పారప్పా ఆడించడంతో పాటు, ఏకంగా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శివాజీ వెనక్కు తగ్గాడు.. సారీ అంటున్నాడు! ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

విజ్ఞత మరిచి, ఇంగిత విడిచి శివాజీ చేసిన వ్యాఖ్యలను నారీమణులు వదిలిపెట్టేలా లేరా..?

టాలీవుడ్ లో పనిచేస్తున్న సుమారు 100 మందికి పైగా మహిళా ప్రొఫెషనల్స్ తరపున ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ పేరుతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ కు ఒక ఘాటు లేఖ రాయడమే దీనికి సంకేతమా..?

అనాల్సినవి అన్నీ అనేసి సారీ చెప్పినంత మాత్రాన్న “మా” ఊరుకుందని అనుకున్నా.. మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. వారెందుకు ఊరుకుంటారు..?

ఈ వ్యవహారం ఇండస్ట్రీలో శివాజీ కెరీర్ ను ఎలా ప్రభావితం చేయబోతోంది..? ఇకపై వేదికలపై శివాజీకి మైకిస్తారా..? అసలు పిలుస్తారా..?

సీనియర్ నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపై ఎవరు ఎన్ని చెప్పినా.. మంచు మనోజ్ లాంటి వాళ్లు.. ఆయన తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను అనే స్థాయిలో సపోర్ట్ చేసినా.. ఇండస్ట్రీలోని మహిళలు మాత్రం ఊరుకునేలా కనిపించడం లేదు. ఈ విషయలో బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ.. మా కు వాళ్లంతా లేఖ రాశారు. ఇలా రాసిన లేఖ నందిని రెడ్డి, సుప్రియ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లాంటి ప్రముఖులు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా… శివాజీ వాడిన భాషపై వీరంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద ఉండి “సామాన్లు”, “దరిద్రపు ము %$#@” లాంటి పదాలు వాడటం చాలా తప్పు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మాటలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, బీ.ఎన్.ఎస్ సెక్షన్ 509 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం అని గుర్తుచేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శివాజీ బహిరంగంగా, ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పర్సనల్ ఛాయిస్ మీద కామెంట్స్ చేయడం, వారిని అవమానించడం కరెక్ట్ కాదని అన్నారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే, లీగల్ గా ముందుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మహిళలను కంట్రోల్ చేయడం, షేమ్ చేయడం ఇక సాగదని తేల్చి చెప్పారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూనే, అదే గ్లామర్ ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.

దీంతో.. బెదిరిపోయారో.. లేక, కళ్లు తెరుచుకున్నాయో తెలియదు కానీ.. నాలుగు మంచి మాటలు చెబుదామనుకొని మాట్లాడానని.. ఆ క్రమంలో అన్ పార్లమెంటరీ పదాలు వాడానని అంగీకరించిన శివాజీ… ఎవ్వర్నీ అవమానించాలని అలా మాట్లాడలేదని, హీరోయిన్లు బయటకెళ్లేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడనని సన్నాయి నొక్కులు నొక్కారు. అయినపటికీ తనను వదలరని అనుకున్నారో ఏమో.. “దరిద్రపు ము….”, “సామాన్లు” అనే వివాదాస్పద పదాలు వాడానని అంగీకరిస్తూ.. అవి వాడినందుకు క్షమాపణలు చెప్పాడు.

అయితే శివాజీ విడుదల చేసిన క్షమానపణ వీడియోతో ఈ వివాదం సమసిపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… ఇప్పటికే ఈ విషయంపై మహిళా కమిషన్ అతడికి నోటీసులు జారీచేసింది. దీంతో… ఆ నోటీసులపై శివాజీ లిఖిత పూర్వకంగా స్పందించాల్సి ఉంది. అటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు ఇందుకేనేమో..!!

బాబు పీఎం || Journalist Bharadwaj About CM Chandrababu as New Prime Minister of India? || Modi || TR