Sigma Teaser : సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ సిగ్మా తో రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్ కిషన్ హీరో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు.
‘మంచోడు.. మహానుభావుడు.. చెడ్డోడు రాక్షసుడు.. చూసే నీ చూపుని బట్టి, ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారుతాను’ అనే హీరో పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఈ లైన్ వెంటనే కనెక్ట్ అవుతూ విజిలెంట్ కథని సూచిస్తుంది.
దర్శకుడిగా జేసన్ సంజయ్ తొలి అడుగే బలమైన స్టేట్‌మెంట్‌లా కనిపిస్తుంది. స్టైలిష్‌గా, హై-ఆక్టేన్ కట్స్‌తో రూపొందిన ఈ టీజర్‌లో ఆయన కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్. తమన్ అందించిన దుమ్మురేపే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఎనర్జీ, ఇంటెన్సిటీని మరింత పెంచింది. డైలాగ్స్, విజువల్స్ చూస్తే సిగ్మా పూర్తిగా విజిలెంట్-హీరో జానర్ తో ఆకట్టుకుంది. ఇది దళపతి విజయ్‌తో అనుసంధానమై ఉన్న స్పేస్ అయినప్పటికీ, జెన్-జీ టచ్‌తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
విజువల్‌గా టీజర్ చాలా రిచ్‌గా, క్లాసీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ, సినిమాకు గ్రాండ్ సినీమాటిక్ ఫీల్ ఇస్తుంది. లైకా ప్రొడక్షన్స్ మరోసారి తమ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను పెద్ద స్థాయిలో ప్రజెంట్ చేసింది
సందీప్ కిషన్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టీజర్ లో అదరగొట్టారు. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జీ—మూడు అంశాల్లోనూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. అంతర్గత సంఘర్షణ, ఆశయం, సహజ స్వభావంతో మలచబడిన పాత్రలో ఆకట్టుకున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో సుందీప్ కిషన్ రా అగ్రెషన్‌కి స్టైలిష్ స్వాగ్ ని అద్భుతంగా క్యారీ చేశారు.

కథనం ఒక ట్రెజర్ హంట్ చుట్టూ తిరుగుతుందని టీజర్ సూచిస్తోంది. యాక్షన్, ట్విస్టులు, థ్రిల్స్‌తో నిండిన ఈ ప్రయాణం ఆసక్తిని మరింత పెంచుతుంది. సుందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుధర్శనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేథరిన్ ఒక హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
స్లిక్ హైస్ట్ స్టైల్ థ్రిల్స్‌ను,ఎమోషనల్ డెప్త్ ని, లైట్ హార్ట్‌డ్ వినోదంతో జేసన్ సంజయ్ యంగ్, డైనమిక్ విజన్‌లో సిగ్మా ఒక న్యూ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్, బెంజమిన్ ఎం. ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు బలమైన టెక్నికల్ బ్యాక్‌బోన్‌గా నిలుస్తున్నాయి.
మల్టిలింగ్వల్ చిత్రంగా రూపొందుతున్న సిగ్మా 2026 సమ్మర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

